2022 సంవత్సరం చివరి దశకు వచ్చింది. మరో కొద్ది రోజుల్లో 2023వ సంవత్సరం రాబోతుంది. అయితే ఈ సంవత్సరం మనందరికీ ఎన్నో గొప్ప జ్ఞాపకాలను వదిలింది. ఈ క్రమంలోనే సినిమా పరిశ్రమకు కూడా ఎన్నో గొప్ప చిత్రాలను అందించింది. ఇక ఈ సంవత్సరం సినిమా పరిశ్రమంలో కూడా ఎన్నో వింత విషయాలు కూడా చోటుచేసుకున్నాయి. కొన్ని సినిమాలు అయితే ఎవరు ఊహించని రికార్డులు కూడా సృష్టించాయి.
ఇక ఇప్పుడు 2022వ సంవత్సరంలో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ఇక ఆ సినిమాలో థియేటర్లోనే కాకుండా ఓటీటీలో కూడా ఎంతో రచ్చ లేపాయి. ఇక అలా ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్కువ మంది చూసిన టాప్ 10 సినిమాలలో ఎక్కువ శాతం సౌత్ ఇండియా సినిమాలే కావడం. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పుష్ప :
అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా గత సంవత్సరం 2021 డిసెంబర్‌లో విడుదలై ఎవరు ఊహించని విజయం అందుకుంది. తర్వాత ఈ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ అయింది.
కే జి ఎఫ్1 & కే జి ఎఫ్2
రాకింగ్ స్టార్ యాష్ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాకు సిక్వల్ గా వచ్చింది కేజీఎఫ్ చాప్టర్ 2 ఈ సినిమా ఈ సంవత్సరం సమ్మర్‌లో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఇండియాలోనే సెన్సేషనల్ హిట్ సినిమాగా నిలిచి 1200 కోట్లకు పైగా కలెక్షన్ను రాబట్టింది. ఈ సినిమా తర్వాత అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవ్వగా అక్కడ కూడా భారీ వ్యూస్ ను దక్కించుకుంది.
సీతారామం:
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీ దత్ నిర్మాణ సంస్థలో హను రాఘవపూడి తెరకెక్కించిన అందమైన ప్రేమ కథ చిత్రం సీతారామం. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాగూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సంవత్సరం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లోనే సెన్సేషనల్ హిట్ సినిమాగా నిలిచింది. తర్వాత అమెజాన్‌లో కూడా అదే స్థాయిలో వ్యూస్ ను దక్కించుకుంది.
పోనియన్ సెల్వన్ 1:
కోలీవుడ్ సీనియర్ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన పోనియన్ సెల్వన్1 కోలీవుడ్ లోనే సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. పాన్ ఇండియా వైడ్ గా కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టుకుంది. ఈ సినిమాను కూడా అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల నుంచి భారీ వ్యూస్ దక్కించుకుంది.
ఈ రకంగా మొదటి ఐదు సినిమాలు సౌత్ ఇండియా సినిమాలు కావటం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మిగిలిన ఐదు సినిమాలు చూసుకుంటే.. బచ్చన్ పాండే, జుగ్ జుగ్ జియో, రన్ వే 34, జురాసిక్ వరల్డ్ డొమైన్, గెహ్రియాన్.