స్టార్ హీరోలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్.. కారణం..?

టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలలో యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు కూడా ఉన్నారు. స్టార్ హీరోలలో మహేష్, ప్రభాస్ ,పవన్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు ఉన్నారు. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ హీరోలు ఏ ఒక్క సినిమా కూడా థియేటర్లో విడుదల కాలేదు. బన్నీ సినిమాలేవి 2022 సంవత్సరంలో రిలీజ్ కాకపోవడంతో ఆయన అభిమానులు ఫీలవుతున్నారు. మరి వచ్చే ఏడాది ఈ హీరోల సినిమాలన్నీ ఒకే సమయంలో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇక మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా వచ్చే యేడాది జనవరిలో మొదలు కాబోతోంది. అలాగే ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ సినిమా కూడా వచ్చే ఏడాది జనవరిలోని మొదలు కాబోతోంది. ఇక అల్లు అర్జున్ పుష్ప -2 సినిమా షూటింగ్ కూడా మొదలైన ఇప్పటికే చాలా నెమ్మదిగా నడుస్తోంది. పవన్, ప్రభాస్ మాత్రం ప్రస్తుతం మూడు ప్రాజెక్టులకు బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ అయితే డైరెక్టర్ బుచ్చిబాబుతో ఒక సినిమాని , శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు.

వీరంతా వచ్చే యేడాది దసరాని టార్గెట్ చేస్తూ..తమ సినిమాలను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కేవలం కొద్ది రోజుల వ్యవధిలోని ఈ ఆరుగురు స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల కాబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ లో విడుదల కాబోతోంది. ఇక మహేష్ , ఎన్టీఆర్ సినిమా షూటింగులు కూడా దసరాను టార్గెట్ చేస్తూ విడుదల చేయబోతున్నారు. 2023 ఫస్ట్ ఆఫ్ లో యంగ్ జనరేషన్ స్టార్ హీరోల సినిమాలలో పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా మాత్రమే విడుదల అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఫస్ట్ ఆఫ్ లో యంగ్ హీరోలు, మిడిల్ హీరోలదే హవా అన్నట్లుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ ఏడాది మాత్రం ఏ ఒక్క సినిమాని విడుదల చేయలేదు ఈ స్టార్ హీరోలు.