`అవ‌తార్ 2`కు అవసరాల శ్రీనివాస్ రెమ్యున‌రేష‌న్ తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

యావ‌త్ సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన `అవ‌తార్ 2` ఎట్ట‌కేల‌కు డిసెంబ‌ర్ 16న అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఏకంగా 160 భాషల్లో ఈ సినిమాను విడుద‌ల చేశారు. జేమ్స్ కేమరూన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మాయా లోకంలో సామ్ వర్థింగ్టన్, జో సల్దాన, సిగొర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్ లెట్, క్లిఫ్ కర్టిస్, జోల్ డేవిడ్ మూర్ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

13 ఏళ్ల క్రితం విడుద‌లైన `అవ‌తార్‌`కు సీక్వెల్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. అయితే అవతార్ 2 సినిమాలో మన తెలుగు దర్శకుడు, నటుడు అయినా అవసరాల శ్రీనివాస్ కూడా భాగమైన విష‌యం విధిత‌మే. ‘అవతార్ 2’ తెలుగు వెర్షన్ కు ఆయన డైలాగ్స్ రాశారు. అమెరికాలో చదువుకున్నాడు. ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు చూసేవాడు. హాలీవుడ్ మేకర్స్ తో ఇతనికి సత్సంబంధాలు కూడా ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలోనే `అవ‌తార్ 2`కు డైలాగ్స్ అందించే అవ‌కాశాలు అవ‌స‌రాలకు వ‌చ్చింది. అయితే ఇందుకు గానూ అవసరాల శ్రీనివాస్ కు `అవ‌తార్ 2` మేక‌ర్స్ గ‌ట్టిగానే ముట్ట‌చెప్పార‌ట‌. `అవ‌తార్ 2`కు అవసరాల శ్రీనివాస్ రెమ్యున‌రేష‌న్ తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది. మేక‌ర్స్ అవ‌స‌రాల‌కు ఏకంగా రూ. 75 లక్షలు ఇచ్చార‌ట‌. డైలాగ్ రైటర్ గా చేసినందుకే ఇంత మొత్తం అందుకోవడం అంటే మామూలు విషయం కాద‌నే చెప్పాలి.