టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కు ఈ ఏడాది అస్సలు కలిసి రాలేదని చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో కెరీర్ పరంగా జోరు చూపించిన పూజా హెగ్డే.. ఈ ఏడాది రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది.
అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను ఘోరంగా నిరాశ పరిచాయి. ప్రస్తుతం పూజా హెగ్డే `సర్కస్` ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది. ఈ బాలీవుడ్ మూవీ డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమాతో అయినా పూజా హెగ్డే హిట్ కొట్టాలని ఆశపడుతోంది. ఈ సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే.. ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫోటోషూట్లతో కుర్ర కారును అల్లాడిస్తుంటుంది.
తాజాగా యాష్ కలర్ డ్రెస్ వేసింది డస్కీ భామ. మోకాళ్ళ పైకి ఉండే స్కట్ లో థండర్ థైస్ ను ఎలివేట్ చేస్తూ హాట్ హాట్ గా ఫోటోలకు పోజులు ఇచ్చింది. అలాగే జాకెట్ విప్పేసి మరి కొంటెగా కవ్విస్తూ దుమారం రేపింది. ప్రస్తుతం పూజా హెగ్డే తాజా ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
పూజా అందాలకు కుర్రకారు ఆగమాగం అయిపోతున్నారు. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో మహేష్ బాబుకు జోడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తోంది. అలాగే కోలీవుడ్, బాలీవుడ్ లోనూ పలు ప్రాజెక్ట్స్ ను టేకప్ చేసింది.