గ్లామర్ డోస్ పెంచేసిన ఫరియా.. బ్లాక్ అండ్ వైట్‌లో టెంప్టింగ్ ఫోజులు!

ఫరియా అబ్దుల్లా.. ఈ హైదరాబాది భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. గత ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన `జాతిరత్నాలు` సినిమాతో హీరోయిన్ గా ఫరియా టాలీవుడ్ కు పరిచయం అయింది.

తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ.. ఆ తర్వాత `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌` మెరుపుతీగల మెరిసి మాయమైంది. ఇక రీసెంట్గా ఈ భామ `లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్` సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

సంతోష్ శోభ‌న్ హీరోగా తెర‌కెక్కిన‌ ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజకు జోడిగా `రావణాసుర` అనే సినిమాలో నటిస్తోంది.

అలాగే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అదిరిపోయే ఫోటోషూట్లతో కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపుతోంది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ నిద్ర పట్టకుండా చేస్తుంది.

తాజాగా బ్లాక్ అండ్ వైట్ లో ఫోటో షూట్ చేసింది. స్లీవ్ లెస్ డ్రెస్ లో హొయలు పోతూ టెంప్టింగ్ గా ఫోటోల‌కు పోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ‌ వైరల్ అవుతున్నాయి.