నాగార్జునకు దిమ్మ తిరిగిపోయే షాక్..బిగ్ రాడ్ దించేసిన బాలకృష్ణ..!

నందమూరి బాలకృష్ణ ఆహలో ‘అన్‌స్టాప‌బుల్’షో తో అదరగొడుతున్నాడు. ఇప్పుడు మరో అదిరిపోయే బుల్లితెర షో బిగ్ బాస్ హౌస్ లోకి బాలయ్య అడుగు పెట్టబోతున్నారని టాక్. రీసెంట్‌గా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ 6 కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే నాగ్ బిగ్ బాస్ నిర్వాహకులతో కుదుర్చుకున్న అగ్రిమెంటు ఈ సీజన్‌తో కంప్లీట్ అవ్వడంతో నాగార్జున బిగ్ బాస్ నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే నాగార్జున బిగ్ బాస్‌ యాజమాన్యానికి కూడా సమాచారం ఇచ్చార‌ని, దీంతో ఇప్పుడు రాబోయే బిగ్ బాస్ సీజన్ కు మరో హోస్ట్ కోసం అన్వేషణ మొదలు పెట్టారని టాక్.. అందులో భాగంగా బిగ్ బాస్ యాజమాన్యం…బాలకృష్ణను సంప్రదించగా ఆయన హోస్ట్ గా చేయడానికి అంగీకరించినట్టు టాలీవుడ్ వర్గాల నుండి టాక్ వినిపిస్తుంది. తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా చేయగా, తర్వాత వచ్చిన రెండో సీజన్ కు నాని, నాగార్జున హోస్ట్ గా చేశారు.

బిగ్ బాస్ షో సీజన్7 కు హోస్ట్ గా బాలకృష్ణ.. దబిడి దిబిడే అంటూ | Balakrishna  Is The Host For Bigg Boss 7 Show Details, Balakrishna, Bigg Boss 7 Telugu  Host, Bigg Boss Telugu 7,

ఇప్పుడు వారి కంటే ఎక్కువ పారితోషకం బాలకృష్ణకు ఆఫర్ చేశారని ఆయన దానికి ఓకే చెప్పాడని
టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే బాలకృష్ణ బిగ్ బాస్ షో చేయడానికి ఎవరు ఊహించని కండిషన్లోపెట్టారని, ఆయన అందులో భాగంగా బిగ్ బాస్ షోకు హోస్ట్ గా చేసిన అదే సమయంలో . ‘అన్‌స్టాప‌బుల్’షోకు కూడా వ్యాఖ్యాతగా కొనసాగుతానని బాలయ్య చెప్పినట్టు సమాచారం. తాను హోస్ట్ గా చేయాలంటే అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్‌ సెట్ వేయకూడదని కూడా బాలయ్య వారికి సూచించినట్టు తెలుస్తుంది. దింతో బాల‌కృష్ణ, నాగార్జునకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చినట్టు అయింది.

బిగ్ బాస్ షో సీజన్7 కు హోస్ట్ గా బాలకృష్ణ.. దబిడి దిబిడే అంటూ | Balakrishna  Is The Host For Bigg Boss 7 Show Details, Balakrishna, Bigg Boss 7 Telugu  Host, Bigg Boss Telugu 7,

ఈ కండిషన్లకు బిగ్ బాస్‌ యాజమాన్యం అంగీకరించారని సమాచారం. ఇక బాలయ్య బిగ్ బాస్ షోకు సంబంధించిన అధికార ప్రకటన కూడా త్వరలోనే రానుంది. బాలయ్య బిగ్ బాస్ షోకు హోస్ట్ అయితే ఆ షో రేంజ్ మారిపోతుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బిగ్ బాస్ షో సీజన్ 7 మొదలు కావడానికి మరో ఎనిమిది నెలల సమయం ఉంది. బిగ్ బాస్ షో సీజన్6 కు రేటింగ్స్ తగ్గగా బాలయ్య ఎంట్రీతో ఈ షోకు రేటింగ్స్ మరింత పెరగడం గ్యారంటీ అని కామెంట్లు కూడా వస్తున్నయి..!