బీచ్‌లో కురచ దుస్తుల్లో తెలుగు యాంకర్.. ఫొటోలు వైరల్!

తెలుగు యాంకర్లలో చెప్పుకోదగ్గ వాళ్లలో యాంకర్ హరితేజ ఒకరు. ఒకవైపు టీవీ రంగంలో తన పయనాన్ని కొనసాగిస్తున్నప్పటికీ మరోవైపు సినిమా నటిగా కూడా తన సత్తాను చాటుకుంటోంది. దాంతో హరితేజ అంటే ఎవరో తెలియని తెలుగు ప్రజలు దాదాపు ఉండరనే చెప్పుకోవాలి. ఇక ఖాళీ సమయాల్లో కూడా సోషల్ మీడియా అంటూ అభిమానులతో సరదాగా గడుపుతూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా హరితేజ కొన్ని హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. సదరు ఫోటోస్ చుసిన నెటిజన్లు అమ్మడి అందానికి ఫిదా అయిపోతున్నారు.

అవును, చల్లని బీచ్ పిల్లగాలులకు అమ్మడు సేదతీరుతోంది. తన కురచైన దుస్తులను చూపిస్తూ అవయవ ప్రదర్శన చేసింది. దానికి మన కుర్రాళ్ళు క్లీన్ బౌల్డ్ అయిపోతున్నారు. ఇకపోతే హరితేజ కూచిపూడి డ్యాన్సర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసినదే. ఆ తరువాతనే బుల్లితెరపైకి నటిగా అడుగు పెట్టి ‘మనసు మమత’ సీరియల్‌ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ‘ముత్యమంత పసుపు’, ‘రక్త సంబంధం’, ‘అభిషేకం’, ‘తాళి కట్టు శుభవేళ’, ‘శివ రంజనీ’, ‘కన్యాదానం’ వంటి సీరియల్స్ ద్వారా జనాలకు పరిచయం అయింది.

కాగా ఆమధ్య బుల్లితెర టాప్ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొని మరింతమందికి చేరువైంది. తద్వారా ప్రేక్షకుల హృదయాలను సైతం గెలుచుకుని ఫినాలేకు చేరింది. ఇక సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై హవాను చూపించిన హరితేజ, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’, ‘అఆ’, ‘గబ్బర్ సింగ్’, ‘యూటర్న్’, ‘హిట్’, ‘ఎఫ్2’, ‘జాంబీ రెడ్డి’ వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది. కాగా ఆమధ్య దీపక్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకొని వివాహజీవితంలో కూడా ఎంట్రీ ఇచ్చింది.