బ్లాక్‌బస్టర్ హిట్‌ను కొద్దిలో మిస్ చేసుకున్న ఆ నటుడు..

రియల్ లైఫ్‌లో డాక్టర్ అయిన భరత్ రెడ్డి యాక్టర్ గా మారి చాలా సినిమాలలో డాక్టర్ రోల్స్‌ చేస్తూ మెప్పిస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్స్‌గా కూడా నటిస్తూ అలరిస్తున్నాడు. రాజా ది గ్రేట్, బింబిసార వంటి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ వేసి ఆకట్టుకున్న ఈ నటుడు తాజాగా ఒక ఇంటర్వ్యూకి హాజరై ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

అసలు సినిమాల్లోకి ఎందుకు వచ్చారు అనే ప్రశ్నకు అతను బదిలిస్తూ.. “విధిరాతను ఎవరూ మార్చలేరు. నేను సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు చాలామంది డాక్టర్ చదువుకున్నావ్, ఇందులోకెందుకు వస్తున్నావు అన్నారు. యాక్టర్ కావాలనుకుంటే ఇంతకాలం ఎంతో కష్టపడి చదువుకున్న డాక్టర్ చదువు వృధా అవుతుందని సలహా ఇచ్చారు. డాక్టర్‌గా, యాక్టర్‌గా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడం అయ్యే పని కాదని కూడా సూచించారు. సినిమాల్లో నటించడం ఇష్టం కాబట్టి అవి నేను పట్టించుకోలేదు.” అని చెప్పుకొచ్చాడు.

సిద్ధం మూవీతో తన కెరీర్ స్టార్ట్ అయిందని, ఈనాడు సినిమాతో మంచి గుర్తింపు లభించిందని అతను తెలిపాడు. ప్రస్తుతం పలు వెబ్‌సిరీస్‌లలో కూడా నటిస్తున్నానని వెల్లడించాడు. అలాగే సినిమాల్లో తను చాలా అవకాశాలు పోగొట్టుకున్నానని చెప్పుకొచ్చాడు. దృశ్యం సినిమాలో చాలా ఎత్తుగా ఉండటం వల్ల ఒక మంచి ఛాన్స్ పోగొట్టుకున్నానని తెలిపాడు. బ్లాక్‌బస్టర్ హిట్‌ అయిన శ్రీమంతుడులో తనకొక మంచి పాత్ర లభించింది అని, ఆ పాత్ర పోషించడానికి అడ్వాన్స్ కూడా ఇచ్చారని కానీ చివరికి అది రాహుల్ రవీంద్రన్‌కి వెళ్లిపోయిందని నిరాశను వ్యక్తపరిచాడు. కేవలం తల్లి కోరిందనే తను డాక్టర్ అయ్యానని, తన స్వస్థలం చిత్తూరు జిల్లా చంద్రగిరి అని ఈ హ్యాండ్సమ్‌ యాక్టర్ తెలిపారు.