అందరినీ నవ్వించే ఆలీ లైఫ్‌లో ఫెయిల్యూర్.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ!

టాలీవుడ్ కమెడియన్ అలీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి నేటికీ తనదైన నటనతో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నారు అంటే అది ఆయనకే చెల్లింది. గతంలో చూసుకుంటే ఆయన లేని సినిమా అంటూ ఉండేది కాదు. నిన్న మొన్నటివరకు వచ్చే సినిమాలలో బ్రహ్మానందం, ఆలీ, వేణు మాధవ్ వంటి కమెడియన్లు లేకుండా ఒక్క సినిమా కూడా వచ్చేది కాదంటే నమ్మశక్యం కాదేమో. ఇక వీళ్ళ క్రేజ్ ని బట్టి చాలా మంది దర్శక నిర్మాతలు వీళ్లను తమ సినిమాల్లో పెట్టుకోవడానికి క్యూలు కట్టేవారని చెబుతూ వుంటారు.

అయితే ఈ క్రమంలో అలీ కేవలం కమెడియన్ గానే కాకుండా హీరోగా కూడా కొన్ని సినిమాలు చేసాడు. ఇక ఆ సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ కావడం విశేషం. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన యమలీల సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. ఆలీ కేవలం వెండితెరకే పరిమితం కాలేదు. బుల్లితెర మీద ప్రసారమయ్యే “ఆలీతో సరదాగా” అనే షో ద్వారా ఎంతోమంది నటులను తన షోకి ఆహ్వానించి వారి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయట పెడుతున్నారు.

అయితే బయటకి నవ్వుతూ పదిమందిని నవ్వించే అలీ జీవితంలో ఒక విషాదగాథ ఉందని ఎంతమందికి తెలుసు? అలీ గతంలో ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడట. ఆ అమ్మాయి ఓ రోజు వర్షం పడుతుండగా వర్షంలో తడుచుకుంటూ రోడ్డుపై వెళ్లడం చూసి, ఆమె వర్షంలో తడవడం ఇష్టం లేక అలీ ఎదురు వెళ్లి గొడుగు ఇచ్చాడట. ఈ క్రమంలో వారి ప్రేమ చిగురించిందట. అయితే వారి ప్రేమ విషయం అమ్మాయి వాళ్ళ అమ్మకి నచ్చలేదట. దాంతో వారు ప్రేమని వదులుకున్నారట. కాగా ఈ విషయాన్ని అలీ తన షోలోనే బయటపెట్టడం గమనార్హం.