ఎక్కడైనా సరే పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు దండిస్తారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సంఘటన చిరంజీవి, రామ్ చరణ్ మధ్య కూడా జరిగిందని తెలిసి ఈ వార్త కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతుంది. నిజానికి సెలబ్రిటీలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరూ ఇండస్ట్రీలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్నారు.అంతేకాదు వరుస భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్న వీరిద్దరూ ఇండస్ట్రీలో తండ్రి కొడుకులు అంటే ఒక పట్టాన నమ్మడం ఇబ్బందిగానే ఉంటుందని చెప్పవచ్చు. చిరంజీవి కూడా ఆరుపదుల వయసులో తన కొడుకుకి పోటీగా సినిమాలు చేస్తూ ఉండడం గమనార్హం.
అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న రామ్ చరణ్ తన తండ్రి చేతిలో.. అది కూడా బెల్టుతో దెబ్బలు తిన్నాడు అంటే నమ్మడానికి , వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఈ విషయాలను రామ్ చరణ్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో నమ్మాల్సి వస్తోంది.. రామ్ చరణ్ మాట్లాడుతూ..” నాన్నగారు ఇంట్లో.. బయట ప్రేక్షకులకు తెలిసిన మెగా స్టార్ లా ఉండరు. ఇంట్లో ఒక జోకు కూడా వేయరు అని తెలిపారు. నేను ఇప్పటివరకు డాడీ ఇంట్లో డాన్స్ చేయడం చూడలేదు అని.. ఎంకరేజ్ చేయడానికి ఒక స్టెప్ అలా వేయడం తప్ప నాన్న ఇనీటియేట్ గా తీసుకొని డాన్స్ చేయడం మాత్రం జరగలేదు అని రామ్ చరణ్ కామెంట్లు చేశారు.
మమ్మీ చెప్పింది డాడీ ఫాలో అవుతారు. నాన్నగారు నన్ను ఒకే ఒక్కసారి కొట్టారు. 8 సంవత్సరాల వయసులో నన్ను నాన్న కొట్టారు అంటూ చెప్పుకొచ్చారు రామ్ చరణ్. ఒకసారి మా డ్రైవర్ సెక్యూరిటీ గేటు దగ్గర కొట్టుకుంటూ మాట్లాడిన మాటలను నేను విని అవే మాటలను ఇంట్లో మాట్లాడానని నాన్నగారు బెల్టు తీసుకొని నన్ను బాగా చితక్కొట్టడంతో పాటు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడవద్దని సూచించారని కామెంట్లు చేశారు. ఇక తర్వాత నేనెప్పుడూ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడలేదని రామ్ చరణ్ తెలిపారు.