తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది నటులు హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఇంతలో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు.అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటివరకు వందకు పైగా చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం కుర్ర హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. కలెక్షన్ల పరంగా కూడా మంచి లాభాలను అందిస్తూ ఉన్నారు బాలయ్య.
ఇదంతా ఇలా ఉండగా ఇటీవలే కాచిగూడ లోని తారక రామ సినిమా థియేటర్ని రీఓపెనింగ్ హాజరైన బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీ గురించి ,ఓటీటి ల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. నారాయణ కే దాస్ నారంగ్ కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ నందమూరి తారక రామారావు గారి పైన ఉన్న అభిమానంతోనే ఏసియన్ తారక రామ థియేటర్ ని సరికొత్త హంగులతో పునరుద్దించారు.. ఈ ఏషియన్ తారక రామ థియేటర్ పునః ప్రారంభం తనకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.
బాలయ్య మాట్లాడుతూ కొన్ని ఏళ్ల నాటి నుంచి చరిత్ర కలిగిన ఈ థియేటర్ ని మళ్ళీ పునః ప్రారంభం చేయడం చాలా ఆనందంగా ఉందని ఈ కార్యక్రమంలో తన తండ్రి నందమూరి తారకరామారావు గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు. అలాగే ఓటీటి ల రూపంలో సినిమా ఇండస్ట్రీకి ఒక కాంపిటీషన్ తయారయ్యింది. అందరం కలిసి మంచి సినిమాలను అందించాలి ప్రేక్షకులు తప్పకుండా థియేటర్‌కు వస్తారు థియేటర్ లో పొందే ఆనందం మరొక లెవెల్ లో ఉంటుందని తెలిపారు బాలయ్య. ప్రస్తుతం బాలకృష్ణ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.