ఆ మూడు ప్ల‌స్ అయితే ర‌వితేజ `ధ‌మాకా` బ్లాక్ బ‌స్ట‌రే!

ధ‌మాకా.. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల జంట‌గా న‌టించిన మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. డిసెంబ‌ర్ 23న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఈ నేప‌థ్యంంలో మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న ట్రైల‌ర్ ను బ‌య‌ట‌కు వ‌ద‌ల‌గా.. మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి 2 గంటల 18 నిమిషాలు ర‌న్ టైమ్ గా లాక్ చేశారు. ఇటీవ‌ల చాలా సినిమాల‌కు త‌క్కువ‌ ర‌న్ టైమ్ బాగా క‌లిసొస్తోంది. ఈ నేప‌థ్యంలోనే సాగతీత సన్నివేశాలు తొల‌గించి ధ‌మాకాకు త‌క్కువ ర‌న్ టైమ్ ను లాక్ చేశార‌ట‌.

అలాగే గతంలో ఎప్పుడు లేని విధంగా ధమాకా సినిమా కోసం రవితేజ దాదాపు రెండు వారాల ముందు నుండే ప్ర‌చార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాడు. ఇక ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎంటర్ టైన్మెంట్ సన్నివేశాలు కూడా దండిగా ఉంటాయ‌ట‌. మొత్తంగా ఈ మూడు అంశాలు ప్ల‌స్ అయితే ధ‌మాకా బ్లాక్ బ‌స్ట‌రే అవుతుంద‌ని అంటున్నారు. మ‌రి ర‌వితేజ ధ‌మాకాతో హిట్ కొడ‌తాడా..లేదా.. అన్న‌ది చూడాలి.