టార్గెట్ పవన్: వైసీపీ ‘కాపు’ కష్టాలు..!

ఎలాగైనా కాపు సామాజికవర్గం మద్ధతు మరొకసారి పొంది..అధికారంలోకి రావాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. రాష్ట్రంలో అత్యధికంగా కాపు ఓటర్లని తమవైపుకు తిప్పుకుంటే చాలు అని జగన్ భావిస్తున్నారు..ఆ దిశగానే ముందుకెళుతున్నారు. అయితే పవన్ కల్యాణ్ రూపంలో వైసీపీకి పెద్ద ఇబ్బంది వచ్చింది. పవన్..చంద్రబాబుతో కలుస్తారనే ప్రచారం నేపథ్యంలో జగన్ అలెర్ట్ అయ్యారు.

అందుకే వైసీపీలోని కాపు నేతలకు పెద్ద టార్గెట్ ఇచ్చినట్లు కనిపిస్తున్నారు. ఇక వైసీపీలో కాపు నేతల కష్టాలు మామూలుగా లేవు. ఎందుకంటే చంద్రబాబుతో పవన్ కలవకుండా ఉండటమే వారి టార్గెట్ అయింది. ఒకవేళ కలిస్తే కాపు ఓట్లు వారికి వెళ్లకుండా చేయాలనేది టార్గెట్. ఆ లక్ష్యంగానే తాజాగా రాజమండ్రిలో వైసీపీలోని కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు..ఇలా అందరూ నేతలు సమావేశమై..పవన్‌-బాబుకు ఎలా చెక్ పెట్టాలనే అంశంపై చర్చించుకున్నారు.

అయితే ఇక్కడ వైసీపీ కాపు నేతలు చాలా లాజిక్‌లు మిస్ అయ్యారు. పవన్ దారుణంగా తమని తిడుతున్నారని వైసీపీ కాపు నేతలు అన్నారు. అలాగే కాపు ఓట్లని చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నారని, కాపులకు తామే ఎక్కువ మంచి పనులు చేశామని, చంద్రబాబు ఏం చేయలేదని మాట్లాడారు. అయితే ఎవరు బూతులు మొదలుపెట్టారో రాష్ట్రంలో అందరికీ తెలుసు. తనని ఇష్టమొచ్చినట్లు తిట్టడం వల్లే..పవన్ బరస్ట్ అయ్యి…తనని తిట్టే వారికి కౌంటర్లు ఇచ్చారు.

ఇక కాపు ఓట్లని బాబుకు తాకట్టు అంటున్నారు..రాష్ట్రంలో కాపు ఓటర్లు అయినా, ఇతర ఓటర్లు అయినా ఏది గుడ్డిగా చేయరు. కాపులకు టీడీపీ హయాంలో ఏం జరిగింది..వైసీపీ హయాంలో ఏం జరుగుతుందో..ఆ కాపు ఓటర్లకే తెలుసు అని కౌంటర్లు వస్తున్నాయి. మొత్తానికి వైసీపీ కాపు నేతలు…కాపు ఓట్లని టీడీపీ-జనసేన వైపుకు వెళ్లకుండా జగన్‌కు మళ్ళీ పడేలా చేయడానికి నానా కష్టాలు పడుతున్నారని చెప్పొచ్చు. ఏదేమైనా ఎవరు ఏంటి అనేది ప్రజలకు బాగా క్లారిటీ ఉంటుంది..కాబట్టి కాపులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎన్నికల్లో క్లారిటీ వస్తుంది.