మన టాలీవుడ్ ముద్దుగుమ్మల చదువు-సంధ్యల గురించి మీకు తెలుసా?

మన టాలీవుడ్లో అందమైన హీరోయిన్లకి కొదువలేదు. ఏ ఇతర భాషలనుండి వచ్చినవారైనా ఇక్కడ ఈజీగా ఇమిడిపోతారు. అయితే ఈ ఫీల్డ్ లోనైనా హీరోయిన్స్ కి గ్లామర్ తో పాటు ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. అలాగే ఇక్కడ కూడా చదువుని కొలమానంగా తీసుకుంటారు. ఎందుకంటే చదువనేది కెరీర్లో రాణించడానికి కావలసిన నాలెడ్జ్, బిహేవియర్ సమకూరుస్తుంది కాబట్టి. ఇకపోతే టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ గా వెలిగిపోతున్న సమంత కానివ్వండి, అనుష్క కానివ్వండి, కాజల్ కానివ్వండి, ఇపుడు రష్మిక, కీర్తి సురేష్… ఇలా పలువురు ఎన్నో మంచి మంచి చదువులు చదువుకున్నవారే.

ముందుగా సమంత విషయానికొస్తే, చదువులో ఈ అమ్మడు కాలేజ్ ఫస్ట్. చదువు విషయంలో చిన్నప్పటి నుండి సమంత చాలా చురుగ్గా ఉండేదట. సమంత చెన్నైలో బి. కామ్ పూర్తి చేసిన విషయం విదితమే. అలాగే అందాల చందమామ కాజల్ కూడా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కాగా కాజల్ మాస్ మీడియా లో BA చేసింది. చదువు పూర్తయ్యాక మోడలింగ్ చేసి హీరోయిన్ అయింది. అలాగే అనుష్క శెట్టి కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. అనుష్క యోగా ట్రైనర్ గా పనిచేసింది కూడా. 2005లో దర్శకుడు పూరి సూపర్ మూవీతో అనుష్కను హీరోయిన్ చేసిన విషయం విదితమే.

ఇక మిల్కీ బ్యూటీ తమన్నా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. 2005లో విడుదలైన హిందీ చిత్రం చాంద్ సా రోషన్ చెహ్రా మూవీతో వెండితెరకు పరిచయం అయింది. మన తెలుగులో ‘హ్యాపీ డేస్’ చిత్రంతో తెరంగేట్రం ఇచ్చింది. అలాగే స్టార్ కిడ్ కీర్తి సురేష్ ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ చేసి, ముఖానికి మేకప్ వేసుకుంది. బేసిగ్గా కీర్తి తండ్రి సురేష్ దర్శకుడు కావడం ఒకవిధంగా హెల్ప్ అయింది. అలాగే సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార BA ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు. 2003లో మలయాళ పరిశ్రమలో నయనతార కెరీర్ మొదలైంది. ఇలా చెప్పుకుంటూ పొతే దాదాపు ఇక్కడ నటించ అందరు హీరోయిన్లు డిగ్రీ కి తక్కువకాకుండా చదివినవారే.