తెలుగుదేశం పార్టీని మొదట నుంచి ఆదరిస్తున్న జిల్లాల్లో శ్రీకాకుళం కూడా ఒకటి. ఎన్టీఆర్‌పై అభిమానంతో మొదట నుంచి ఈ జిల్లా టీడీపీని ఆదరిస్తూనే ఉంది. అందుకే ఆ జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉంది. అయితే గత ఎన్నికల్లో ఈ కంచుకోటని వైసీపీ బద్దలుగొట్టింది..జిల్లాలో మొత్తం 10 సీట్లు ఉంటే..8 వైసీపీ గెలుచుకుంది..రెండు టీడీపీ గెలుచుకుంది. ఇక ఈ ఓటమి నుంచి బయటపడటమే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు పనిచేస్తున్నాయి. టీడీపీ నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, కిమిడి కళా వెంకట్రావు, కూన రవికుమార్, అశోక్ లాంటి నేతలు పార్టీకి పిల్లర్లుగా ఉన్నారు.
అటు వైసీపీ ఎమ్మెల్యేలపై అనూహ్యంగా వ్యతిరేకత పెరుగుతుంది..మూడు రాజధానుల పేరుతో విశాఖని రాజధాని కాన్సెప్ట్‌తో వైసీపీ సెంటిమెంట్ లేపుతున్నా సరే..అంత ఎక్కువగా శ్రీకాకుళం ప్రజలు వైసీపీని నమ్ముతున్నట్లు కనిపించడం లేదు. అంటే ఇక్కడ వైసీపీ బలం తగ్గుతూ వస్తుంది..అలా అని టీడీపీ బలం మరీ పెరగడం లేదు. కొన్ని స్థానాల్లో పర్లేదు గాని..కొన్ని స్థానాల్లో మాత్రం టీడీపీకి టీడీపీనే శత్రువు అనే పరిస్తితి తయారైంది. ఎక్కడకక్కడ గ్రూపు తగాదాలు ఉన్నాయి..సీటు కోసం నేతల మధ్య పోటీ పెరుగుతుంది..ఒకరికి సీటు మరొకరు సహకరించే పరిస్తితి కనిపించడం లేదు. మొదట పాతపట్నంలో టీడీపీకి చాలా అనుకూలమైన వాతావరణం ఉంది..కానీ ఇక్కడ కలమట వెంకటరమణమూర్తి, మామిడి గోవిందరావు వర్గాలకు పడటం లేదు. ఈ ఇద్దరు సీటు కోసం ట్రై చేస్తున్నారు..ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించడం కష్టమే.
అటు రాజాం సీటు కోసం కొండ్రు మురళీమోహన్‌తో పాటు మాజీ స్పీకర్ ప్రతిభాభారతి తనయురాలు గ్రీష్మ సైతం ట్రై చేస్తున్నారు..ఇక్కడ అదే పరిస్తితి..ఎవరికి సీటు ఇచ్చినా ఇబ్బందే. శ్రీకాకుళం అసెంబ్లీలో గుండా లక్ష్మీ యాక్టివ్ గా లేరు…వేరొకరికి సీటు ఇస్తే..గుండా వర్గం సహకరించదు. ఎచ్చెర్లలో సీనియర్ నేత కళా వెంకట్రావుకు వ్యతిరేక వర్గాలు ఉన్నాయి. నర్సన్నపేట, పాలకొండ నియోజకవర్గాల్లో అదే పరిస్తితి. ఇలా గ్రూపులు ఉండటం వల్ల టీడీపీకి నష్టం జరిగే ఛాన్స్ ఉంది.