తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి హీరోయిన్ ఆసిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ. మొదట రవితేజ తో కలిసి అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రంలో నటించిన ఆసిన్. ఆ తరువాత పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇకపోతే తెలుగులో ఈ ముద్దుగుమ్మ శివమణి ,గజిని ,ఘర్షణ వంటి చిత్రాలలో నటించింది. అతి తక్కువ సమయంలోనే వరుసగా సినిమాలు అందుకోవడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి సుపరిచితురాలు అయ్యింది.
తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్, తమిళ్ వంటి భాషలలో కూడా నటించింది ఆసిన్. హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే 2016లో రాహుల్ శర్మ అనే ఒక బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకొని సినిమాలకు దూరమయ్యింది. ఇక ఆ తరువాత ఏ సినిమాలో కూడా నటించలేదు ఆసిన్. ఇలా సినిమాలకు గుడ్ బై చెప్పినా తర్వాత సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన కుటుంబం సంబంధించి విషయాలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.
ఇదంతా ఇలా ఉండగా తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆసిన్ తాజాగా తన భర్త రాహుల్ కు కూతురు ఆరిన్ మేకప్ వేసింది.అలాగే లిఫ్టిక్ ,కాన్ఫక్ట్ వంటివి చక్కగా వేసింది. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలను ఆసిన్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఫోటోలలో ఆసిన్ కూతురు చూడడానికి ఎంతో క్యూట్ గా ఉందని పలువురు నెటిజన్ల సైతం కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram