టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్న సునీల్ .. తన కెరియర్ మొదట్లో ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడో మనకు తెలిసిందే . నువ్వు నాకు నచ్చావ్, నువ్వు లేక నేను లేను, నువ్వే కావాలి ,నువ్వే నువ్వే ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నో సినిమాలు ..ప్రతి సినిమాలోను సునీల్ చేసిన కామెడీని మళ్ళీ చేయకుండా సరికొత్త స్టైల్ లో కామెడీని పండిస్తూ కోట్లాదిమంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు .
ఇంకా పక్కాగా చెప్పాలంటే కచ్చితంగా మా సినిమాలో ఈ కమెడియన్ ఉండాల్సిందే అంటూ స్టార్ హీరోల సైతం ఆయనను అడిగి మరీ ఒప్పించి తమ సినిమాల్లో పెట్టుకున్నారు. ఒకానొక టైం లో స్టార్ హీరోలు కూడా సునీల్ కాల్ షీట్స్ కోసం వెయిట్ చేసారు అనడంలో ఆశ్చర్యం లేదు . అయితే హీరో అవ్వాలన్న ఇంట్రెస్ట్ తో సునీల్ కమెడియన్ నుంచి హీరోగా మారాడు . అయితే హీరోగా సునీల్ సక్సెస్ అవ్వలేకపోయాడు . మళ్ళీ పుష్ప సినిమా ద్వారా తన స్టైల్ లో విలన్ రోల్ లో కామెడీని పండిస్తూ జనాలకు దగ్గరయ్యాడు.
పుష్ప సినిమాలో మంగళం శీను పాత్రలో సునీల్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉండింది . కాగా పుష్ప సినిమా తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తున్న సునీల్ కు కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆయన రీసెంట్గా నటిస్తున్న “మావీరన్” చిత్రంలో సునీల్ కు అదిరిపోయే కీలకపాత్రను ఆఫర్ చేశాడు. అంతేకాదు ఈ సినిమాకు సునీలే కావాలంటూ ప్రత్యేకంగా శివ కార్తికేయన్ ఆయనకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారట . ఒక కోలీవుడ్ స్టార్ హీరో మన తెలుగు కమెడియన్ కి కాల్ చేసి రిక్వెస్ట్ చేయడం అంటే ఎంత గర్వకారణమో అర్థం చేసుకోవచ్చు . కాగా ఈ మూవీ ద్వారా సునీల్ కెరియర్ పిక్స్ కి చేరుతుంది అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . చూద్దాం సునీల్ కెరియర్ ఎలా మలుపు తిరగబోతుందో..?