3వ రోజు కుమ్మేసిన స‌మంత‌.. `యశోద` టోట‌ల్ వ‌సూళ్లు ఇవే!

`యశోద`.. ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత టైటిల్ పాత్ర‌లో న‌టించిన స‌స్పెన్స్ ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. హరి-హరిష్ ద్వయం దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుంద‌న్‌, రావు రమేశ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

దాదాపు రూ. 40 కోట్ల బ‌డ్జెట్‌తో శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం.. నవంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై హిట్‌ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో స‌మంత బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దులిపేస్తోంది. విడుద‌లైన 3వ రోజు కూడా అదిరిపోయే వ‌సూళ్ల‌తో క‌మ్మేసింది.

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 1.70 కో ట్లు, 2వ రోజు రూ. 1.76 కోట్ల రేంజ్‌లో షేర్‌ను రాబ‌ట్టిన ఈ చిత్రం.. 3వ రోజు రూ.1.58 కోట్ల రేంజ్ లో షేర్ ని ద‌క్కించుకుంది. ఇక‌ వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 2.61 కోట్ల షేర్‌ను క‌లెక్ట్ చేసింది. ఇక ఏరియాల వారీగా య‌శోద 3 డేస్ వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ ఓసారి గమనిస్తే..


నైజాం: 2.58 కోట్లు
సీడెడ్: 48 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 60 ల‌క్ష‌లు
తూర్పు: 31 ల‌క్ష‌లు
పశ్చిమ: 18 ల‌క్ష‌లు
గుంటూరు: 33 ల‌క్ష‌లు
కృష్ణ: 34 ల‌క్ష‌లు
నెల్లూరు: 15 ల‌క్ష‌లు
———————————-
ఏపీ+తెలంగాణ = 4.97 కోట్లు(8.80 కోట్లు~ గ్రాస్‌)
———————————-

తమిళం – 65 ల‌క్ష‌లు
క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా – 75 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్ – 2.00 కోట్లు
———————————-
టోటల్ వరల్డ్ వైడ్ – 8.37 కోట్లు(17.80 కోట్లు~ గ్రాస్)
———————————-

కాగా, రూ. 12 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. ఇంకా రూ. 3.63 కోట్ల షేర్‌ను రాబ‌డితే బాక్సాఫీస్ వ‌ద్ద య‌శోద క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.