అప్పుడు తండ్రి ..ఇప్పుడు కూతురు.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..వైరల్..!!

“కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చు ఏమో కానీ రావడం అయితే పక్కా..” ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిందే . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల సినిమాలో ఈ డైలాగ్ బాగా పాపులారిటీ తెచ్చుకుంది . కాగా ఈ డైలాగ్ ని వాడుతూ ప్రజెంట్ పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ స్ట్రాటజీని మారుస్తూ అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో ఫుల్ బిజీగా మారిపోయారు . పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎలాంటి పొజిషన్లో ఉన్నాడు మనకు తెలుసు. ఎవరు టచ్ చేయలేని అంత ఎత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ..రాజకీయాల్లో కూడా అలాంటి ఓ పోజీషన్ కి చేరుకుంటారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు .

కాగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో తెలిసిందే. ఆయనకు ప్రాణహాని ఉంది అంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయన ను హతమార్చడానికి చూస్తున్న వాళ్లకి వార్నింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సైతం “నన్ను ఎవడు ఏమి చేయలేరు” అంటూ కార్ పైకి ఎక్కి రోడ్ షో చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. కాగా ఇప్పుడు అదే పొజిషన్లో పవన్ కళ్యాణ్ కూతురు ఆధ్యా కూడా కార్ టాప్ పై న్లుచున్న వీడియో .. ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో ట్రేండింగా మారాయి .

ఈ ఫొటోస్ ,వీడియో షేర్ చేసింది ఎవరో కాదు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. ఈ ఫోటోను షేర్ చేస్తూ “తండ్రి బాటలో కూతురు “అనే క్యాప్షన్ ఇచ్చింది . దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. “పవన్ కళ్యాణ్ ను వద్దనుకున్న నువ్వు ఇప్పుడు ..ఆయన పేరుని తీసుకురావాల్సిన అవసరం ఏంటి..?” అంటూ పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . అంతేకాదు ఇప్పటివరకు కూడా ట్రోల్ అవ్వని ఆధ్యా ని కొందరు రాజకీయ నేతలు కావాలనే ట్రోల్ చేస్తున్నారు అంటూ పవన్ ఫ్యాన్స్ మరింత బాధపడుతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)