అలాంటి జబ్బులతో బాధపడుతున్న రామ్ చరణ్..!!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నట వారసుడు రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇటీవల ఆర్ఆర్ అర్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరు పొందారు.ఇటీవలే ఈ సినిమాని జపాన్ లో విడుదల చేయగా అక్కడ కూడా బాగానే సక్సెస్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఇండియాకు వచ్చి ఢిల్లీలో నిర్వహించిన హిందూస్తాన్ టైం లీడర్షిప్ సబ్మిట్ లో పాల్గొనడం జరిగింది. ఈ సమ్మిట్ కి సౌత్ నుంచి రామ్ చరణ్ రాగ బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ రావడం జరిగింది.

Daily Culture on Twitter: "Lot of debate on the entries of #RamCharan and  #JrNTR in RRR. Let's settle it here. Who had the better entry scenes in RRR?  RT - Ram Charan

అయితే రామ్ చరణ్, అక్షయ్ కుమార్లు ఒకే వేదికపై సందడి చేయడం ప్రేక్షకులకు కనువిందుగా అనిపించింది. అంతేకాకుండా అక్కడ మీడియా కొన్ని ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. ఇక వీరిద్దరూ కలిసి తెలుగు, హిందీ పాటలకు డాన్స్ వేయడం కూడా జరిగింది. అందుకు సంబంధించి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ RRR సినిమాలు ఇంట్రో సీన్ గురించి అడగడం జరిగింది. RRR చిత్రంలో రాంచరణ్ ఇంట్రో సీన్ చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.

Can you guess how many days it took to shoot Ram Charan's opening scene in ' RRR'? Watch this BTS video | Telugu Movie News - Times of India

ముఖ్యంగా అందులో వేలమంది జనం మధ్యలో రామ్ చరణ్ ఒక పోలీస్ ఆఫీసర్గా ఎంట్రీ ఇవ్వడం అభిమానులనే కాకుండా ప్రేక్షకులను సైతం గుర్తుండిపోయేలా నటనను ప్రదర్శించారు రామ్ చరణ్. ఈ సీనుపై మాట్లాడుతూ రామ్ చరణ్ దాదాపుగా 30 రోజులు సమయం పట్టిందని ఈ ఎంట్రీ సీన్ తీయడానికి అని తెలిపారు. అంతేకాకుండా తనకు అసలే” సైనస్ ప్రాబ్లం డస్ట్ ఎలర్జీ “ఉందని తెలియజేశారు. ఇక ఈ ఎంట్రీ సీన్ కేవలం డస్టులోనే తీయవలసి వచ్చిందని తెలిపారు. ముఖ్యంగా 3000 వేల మంది జనాలలో డైరెక్టర్ ఎక్కడ కనిపించలేదు. ఎక్కడో దూరంగా ఉండి కేవలం వైట్ క్లాత్ సిగ్నల్ ఇచ్చే వారిని తెలిపారు. ఇక ఎంట్రీ సీన్ కోసం చాలానే కష్టపడ్డాము అందుచేతనే కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని తెలిపారు రామ్ చరణ్.