ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు అందంతో పాటు ఫిట్నెస్ ని మెయింటైన్ చేయడం చాలా అవసరమని చెప్పవచ్చు. అందుచేతనే హీరోయిన్లు సైతం ఎక్కువగా హెవీ వర్క్ అవుట్లు చేస్తూ బరువు పెరగకుండా చూసుకుంటూ ఉంటారు. మరొకవైపు జిమ్ లో పలు హాట్ నెస్ తో కూడా అదరగొడుతున్న స్టార్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అందం కోసం జిమ్ములో గంటల తరబడి వర్కౌట్ చేస్తూ ఉండే హీరోయిన్లలో రకుల్ ప్రీతిసింగ్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఆటు తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. సౌత్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల చేసి మంచి విజయాలు అందుకున్న రకుల్ ఒక్కసారిగా టాలీవుడ్ ను వదిలేసి బాలీవుడ్ వైపు తన మకాన్ని మార్చేసింది.
ఇక అలా బాలీవుడ్ కి వెళ్ళినప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా బాడీ ఫిట్నెస్ పైన తన ఫోకస్ మొత్తం పెట్టింది. ముఖ్యంగా జీరో ఫాట్ బాడీని మెయింటైన్ చేయడంలో రకుల్ ప్రీతిసింగ్ తర్వాతే ఇతర హీరోయిన్లు ఉంటారని చెప్పవచ్చు. ఏదైనా ఖాళీ సమయం దొరికితే చాలు ఎక్కువగా జిమ్ములో వర్క్ అవుట్ చేస్తూ ఉంటుంది ఈ అమ్మడు. ఇప్పటివరకు ఎన్నో వీడియోలు జిమ్ వర్క్ అవుట్ లకు సంబంధించి చాల వీడియోలను అభిమానులతో పంచుకోవడం జరిగింది రకుల్.
ప్రస్తుతం హెవీ వెయిట్ లిఫ్టు చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియో అని తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసి ఆ కుర్రకారుల మతులు పోగొట్టేలా చేస్తోంది. టైట్ జిమ్ వేర్ లో రకుల్ స్లిమ్ ఫిట్ అందాలు ప్రదర్శించడమే కాకుండా నాజూకుగా తయారయ్యేందుకు కూడా మొత్తం ఫ్యాట్ ను కరిగించడం కోసమే ఇలా కష్టపడుతోందని పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఈమె వర్క్ అవుట్ చూసా ఎంతోమంది నెటిజెన్లు కూడా ఫిదా అవుతూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ వీడియో వైరల్ గా మారుతోంది.
View this post on Instagram