పొట్టి గౌనులో చిట్టి టెంప్టింగ్ పోజులు.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న తాజా ఫోటోలు!

ఫరియా అబ్దుల్లా.. ఈ యంగ్‌ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ `జాతిరత్నాలు` సినిమాతో చిట్టిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఫరియా.. తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది.

అలాగే ఈ సినిమాతో ఫరియాకు కావాల్సినంత క్రేజ్ ద‌క్కింది. జాతిరత్నాలు తర్వాత ఫరియా రీసెంట్‌గా `లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. సంతోష్ శోభన్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించ‌లేక‌పోయింది.

ఇక‌ ప్రస్తుతం చిట్టి ఆశలన్నీ తన తదుపరి చిత్రమైన `రావణాసుర`పైనే పెట్టుకుంది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా సుధీర్ వ‌ర్మ దర్శకత్వంలో రూపొదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్ల పై అభిషేక్‌ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మిస్తున్నారు.

షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సంగతి పక్కన పెడితే.. ఫ‌రియా లేటెస్ట్ గ్లామ‌ర‌స్ ఫోటోలు సోష‌ల్ మీడియాను ఓ రేంజ్‌లో షేక్ చేస్తున్నాయి.

గ్రీన్ కలర్ పొట్టి గౌను ధరించిన చిట్టి థండ‌ర్ థైస్‌ను ఎలివేట్ చేస్తూ టెంప్టింగ్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ పిక్స్‌ అటు అభిమానులను, ఇటు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.