యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి తండ్రి కాబోతున్నాడని, ఆయన సతీమణి ప్రముఖ హీరోయిన్ నిక్కీ గల్రానీ గర్భం దాల్చిందని గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రెగ్నెన్సీ వార్తలపై నిక్కీ గుట్టు విప్పింది.
ఒక్క పోస్టుతో అంతా తేల్చేసింది. ఇంకెందుకు ఆలస్యం డెలివరీ డేట్ కూడా మీరే చెప్పండి అంటూ ప్రెగ్నెన్సీ వార్తలపై కాస్త అసహనం వ్యక్తం చేసిన నిక్కీ.. సోషల్ మీడియాలో తాను తల్లి కాబోతున్నానంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది.
అలాగే ఇలాంటి రూమర్లను నమ్మొద్దని.. ఏదైనా ఉంటే తానే స్వయంగా వెల్లడిస్తానని పేర్కొంది. దీంతో నిక్కీ ప్రెగ్నెంట్ కాదన్న విషయం స్పష్టంగా తేలిపోయింది. కాగా, ఈ ఏడాది మే 18న చెన్నైలో ఆది పినిశెట్టి, నిక్కీలు అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. వివాహంతో ఒక్కటి కావడానికి రెండేళ్ల ముందునుంచీ వీరు డేటింగ్లో ఉన్నారు. ఆపై పెద్దలను ఒప్పించి గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు.
— Nikkii Galrani Pinisetty (@nikkigalrani) November 18, 2022