పాత్రల ఎంపిక విషయంలో నయనతార చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె నేటికీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది అంటే దానికి కారణం ఎంపిక విషయంలో పర్ఫెక్షన్ గా ఉండడమే.. నయనతార ఎంచుకునే ఏ కథ అయినా సరే పాత్రకు ప్రాధాన్యత ఉండే విధంగా చూసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నయనతార ఇప్పుడు తమిళంలో మరొక హార్రర్ థ్రిల్లర్ “కనెక్ట్” సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు అశ్విన్ శరవనన్ దర్శకత్వం వహిస్తున్నారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార ఆమె భర్త విగ్నేష్ శివన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇక శుక్రవారం రోజున నయనతార 38వ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేయగా ఆద్యంతం ఈ టీజర్ వణుకు పుట్టిస్తోంది..
1మినిట్ 30 సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్ లో విచిత్ర ఆకారంలో ఉన్న ఒక అమ్మాయి తనని విడిపించమని డోర్ కొడుతున్న విజువల్స్ తో డార్క్ చీకట్లో టీజర్ మొదలవుతుంది. ఆ తర్వాత నయనతారను అనుపమ్ ఖేర్ గైడ్ చేయడం.. చీకటి గదిలో ఉన్న రూపాన్ని చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురవడం.. వంటి సన్నివేశాలతో టీజర్ సాగింది. ముఖ్యంగా చిత్రమైన రూపంలో చీకట్లో కనిపిస్తున్న ఆకారం వెన్నులో వణుకు పుట్టిస్తుంది . ఇందులో అనుపమ్ ఖేర్, సత్యరాజ్ , వాన ఫేమ్ వినయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
మరోపక్క కీలకమైన అమ్మాయి పాత్రలో హనియా నఫిష్ నటించింది. ముఖ్యంగా ఈ అమ్మాయి పాత్ర సినిమాకి కీలకం. 2015లో అశ్విన్ శరవనన్ నిర్మించిన మాయా తర్వాత నయనతారతో కలిసి చేస్తున్న రెండవ సినిమా ఇది . అధ్యంతం ఉత్కంఠ భరితంగా ఒళ్ళుగగుర్పొడిచే సన్నివేశాలతో వణుకు పుట్టించేలా ఈ సినిమా ఉండనున్నట్లు మనకు టీజర్ ద్వారా అర్థమవుతుంది. కార్తికేయ టు తో సౌత్ సినిమాలలో నటించడం మొదలుపెట్టిన బాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ అనుపమ ఖేర్ చాలా రోజుల తర్వాత తమిళ్ సినిమాలో నటించిన సినిమా ఇది. “కనెక్ట్.. డెవిల్ అంత తొందరగా విడిచి వెళ్లదు” అనే క్యాప్షన్‌తో రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.