నా వల్లే దాసరి గారు లాభపడ్డారు.. నరసింహారాజు..!

జగన్మోహిని సినిమా ద్వారా హీరోగా లైమ్ లైట్ లోకి వచ్చిన హీరో నరసింహారాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే గత కొద్ది రోజుల నుంచి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయన సొంత ఆస్తుల గురించి.. కుటుంబం గురించి.. అలాగే ఎన్నో సినిమా విశేషాల గురించి అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తన సినిమా విషయాలను చెప్పుకొస్తూ.. చెన్నైలో తన కెరియర్ మొదలుపెట్టి అక్కడే హీరోగా నటించి.. మంచి మంచి సినిమాలలో అవకాశాలు పొందగలిగాను.. ఎక్కువగా విఠలాచార్య సినిమాలలో నేను హీరోగా కనిపించాను. ఆ మధ్య కాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కి మకాం మారడంతో ఎక్కువ సినిమాలలో నటించలేకపోయాను.. కుటుంబం అంతా మద్రాస్ లో ఉన్నప్పటికీ నేను మాత్రం నాకు తొలినాళ్ళలో అవకాశం ఇచ్చిన దాసరి గారు పిలవడంతో హైదరాబాద్ కి వచ్చాను అంటూ తెలిపారు నరసింహారాజు.

అయితే హైదరాబాదు వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలో తెలియక.. దాసరి ఇంటికి వెళ్ళితే.. అప్పటికే లాస్ లో ఉన్న జూబ్లీ చెక్ పోస్టు వద్ద ఉన్న బంగ్లాలో ఉండమని చెప్పారట. సినిమాల్లో వేషాలు దొరికితే చేసుకో.. లేదంటే ఆ బంగ్లా లావాదేవీలను చూసుకోమని చెప్పారట దాసరి. దాంతో ఆ బిజినెస్ ని ఆయన కొన్ని రోజుల్లోనే లాభాలు పట్టించారట. రోజుకు 5000 రూపాయలు జీతం తీసుకుని ఆ బంగ్లాను ఒక రెస్టారెంట్ గా మార్చి.. మద్రాస్ నుంచి సినిమా అవకాశాల కోసం వచ్చిన వారికి షెల్టర్ ఇస్తూ.. ఒక కల్చరల్ హబ్ గా మార్చి దానిని బాగా డెవలప్ చేశారట.

అలా ఆ ఆస్తిని కాపాడి దాసరి కి వేలల్లో డబ్బు సంపాదించే వనరుగా మార్చారట.. ఆ తర్వాత తెలుగులో సీరియల్స్ లో అవకాశం రావడంతో బిజీ అయిపోయి బంగ్లా వ్యవహారాలను వేరే వాళ్లకు అప్పగించారని సమాచారం. అలా నష్టాల్లో ఉన్న ఆ బంగ్లాకు లాభాలు తెప్పించి దాసరికి లాభాలు అందించారు నరసింహారాజు.