గుంటూరు వెస్ట్‌పై కన్యూజన్..జనసేనకు వదులుతారా?

ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. దశాబ్దాల పాటు ఆ స్థానాల్లో టీడీపీ సత్తా చాటుతూ వస్తుంది..కానీ గత ఎన్నికల్లో కంచుకోటల్లో టీడీపీ ఓటమి పాలైంది. అయితే గుంటూరు వెస్ట్, రేపల్లె స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఇక గుంటూరు వెస్ట్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మద్దాలి గిరి..వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో వెస్ట్ సీటులో టీడీపీ ఖాళీ అయింది..మద్దాలి అటు వెళ్ళడంతో కోవెలమూడి రవీంద్రని ఇంచార్జ్‌గా పెట్టారు.

అయితే కోవెలమూడికి నెక్స్ట్ గుంటూరు వెస్ట్ సీటు ఇస్తారా? అంటే అది డౌటే అని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు…కోవెలమూడికి సీటు హామీ ఇవ్వలేదు. కేవలం వెస్ట్‌లో పార్టీ బలం పెంచే విధంగా పనిచేయాలని ఇంచార్జ్ పదవి ఇచ్చారు. కానీ వెస్ట్ సీటుపై కోవెలమూడి ఆశలు పెట్టుకున్నారు. ఈయనే కాదు..ఇంకా కొంతమంది వెస్ట్ సీటుపై కన్నేశారు. ఎందుకంటే ఈ సీటులో నిలబడితే ఈజీగా గెలిచేయొచ్చు..ఇక్కడ టీడీపీకి బలం ఎక్కువ కాబట్టి..సేఫ్ సీటు అని భావిస్తున్నారు.

కానీ ఈ సీటు చంద్రబాబు ఎవరికి ఇస్తారో క్లారిటీ లేదు. పైగా జనసేనతో పొత్తు ఖాయమయ్యేలా ఉంది. దీంతో గుంటూరులో కొన్ని సీట్లు జనసేనకు వదలాలి. గుంటూరులో కొన్ని సీట్లలో జనసేనకు బలం ఉంది. గెలిచే బలం లేదు గాని..గెలుపోటములని డిసైడ్ చేసే బలం ఉంది. తెనాలి, గుంటూరు వెస్ట్, ఈస్ట్, ప్రత్తిపాడు, సత్తెనపల్లి సీట్లలో జనసేనకు బలం ఉంది. వీటిల్లో ఖచ్చితంగా రెండు, మూడు సీట్లు జనసేన అడిగే అవకాశాలు ఉన్నాయి.

తెనాలిలో ఎలాగో నాదెండ్ల మనోహర్ ఉన్నారు.. ఆ సీటు అడిగే ఛాన్స్ ఉంది. కానీ అక్కడ టీడీపీ తరుపున బలమైననేత ఆలపాటి రాజా ఉన్నారు. ఒకవేళ తెనాలి రాజాకు ఇస్తే..నాదెండ్లకు జనసేన తరుపున గుంటూరు వెస్ట్ సీటు ఇవ్వొచ్చు. లేదంటే నాదెండ్ల తెనాలిలోనే ఉంటే.. రాజాని వెస్ట్‌కు పంపిస్తారని తెలుస్తోంది. ఒకవేళ బీజేపీతో కూడా పొత్తు ఉంటే…అప్పుడు కన్నా లక్ష్మీనారాయణ వెస్ట్ రేసులోకి రావచ్చు. మొత్తానికి గుంటూరు వెస్ట్ సీటుపై కన్ఫ్యూజన్ ఉంది.