జబర్దస్త్ లో కమెడియన్లుగా పేరుపొందిన ఇమ్మాన్యూయేల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక ఇందులోనే బుల్లితెర నటి వర్ష కూడా కమెడియన్ గా మంచి పేరు సంపాదించింది. ఇక ఇమ్మాన్యూయేల్, వర్ష ఇద్దరు కలిసి చేసే స్కిట్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా మంచి జోడీగా కూడా పేరు సంపాదించింది. సుధీర్, రష్మీ జోడి తర్వాత వీరిద్దరి జోడి కి మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం అన్ని షోల్లోను వీళ్ళ కెమిస్ట్రీ స్కిట్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే రియల్ గా వర్షాకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇమ్మాన్యూయేల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.
అసలు విషయంలోకి వెళ్తే స్టాండ్ ఆఫ్ కమెడియన్ గా కెరియర్ని ప్రారంభించిన వర్ష మొదట సీరియల్స్ లో నటిస్తూ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో జబర్దస్త్ లోకి ఎంటర్ ఇచ్చి కమెడియన్గా సెటిల్ అయిపోయింది. ఇందులో కెవ్వు కార్తీక్ టీంలో ఇమ్మాన్యూయేల్, వర్ష చేసి స్కిట్ల వల్ల ప్రతి ఒక్కరు కడుపుబ్బ నవ్వుతూ ఉంటారు. ఇక అప్పట్లో వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని వార్తలు కూడా చాలా వైరల్ గా మారాయి కానీ వీరిద్దరూ కేవలం స్కిట్ల కోసమే ఇలా నటించారని వార్తలు రావడం జరిగింది.
వర్ష,ఇమ్మాన్యూయేల్ బయట కూడా మంచి స్నేహితులు ఇక వచ్చే నెల వర్ష పుట్టినరోజు సందర్భంగా అంతకంటే ముందు ఇమ్మాన్యూయేల్ హైదరాబాదులో ఒక జ్యువెలరీ షోరూం కి వర్ష ని తీసుకువెళ్లి ఒక బంగారు చౌకరిని కొనిచ్చినట్లుగా తెలియజేశారు ఇమ్మాన్యూయేల్. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలు వేసుకుంటున్నారు.
https://youtu.be/VugSJ0cGYZ0?t=1655