నటిగా నర్తకి గా ఎల్ విజయలక్ష్మి 60వ దశకంలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి సినిమాలు చూసేవారికి ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఈమె తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘ఆ ఇంటర్వ్యూలో విజయలక్ష్మి తనుకు సంబంధించిన ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. ఆమె ఆ ఇంటర్వ్యూలో సావిత్రి , జమున, బి సరోజా దేవి నాకంటే సీనియర్ హీరోయిన్లు.. అయినా వాళ్లు నా డాన్స్ అంటే ఎంతో ఇష్టపడేవారు.. వాళ్ల నటన అంటే నాకు ఎంతో ఇష్టం అని విజయలక్ష్మి అన్నారు’.
ఆ టైంలో ఉన్న అందరి హీరోయిన్స్ తో నేను చాలా ఫ్రెండ్లీగా క్లోజ్ గా ఉండే దానిని.. మా మధ్య ఎలాంటి గొడవలు అసూయ ద్వేషాలు ఉండేవి కాదు.. ఆరోజుల్లో షూటింగ్ అంటే ఒక విహార యాత్ర లాగా జరిగిపోయేది. ‘ఇక నేను తొలిసారిగా జగదేక వీరుని కథ సినిమాలో మొదటిగా ఎన్టీఆర్ తో నటించాను.. ఈ సినిమా తర్వాత ఆయనతో నేను ఎన్నో సినిమాల్లో నటించాను. ఆయన నన్ను కోడలా అని ముందుగా పిలిచేవారు. దానికి కారణం నర్తనశాల సినిమాలో నేను ఆయనకి కోడలుగా నటించాను ఇక అప్పటి నుంచి నన్ను ఆయన కోడలా అని పిలిచేవారు’.
ఎన్టీఆర్ ఎప్పుడు నేను స్టార్ హీరోను అన్నట్టు ఉండేవారు కాదు.. చాలా క్యాజువల్ గా ఉండేవారు. తన సమయానికి ముందే షూటింగ్ రూమ్ కి వచ్చి మేకప్ వేసుకుని ఆయన రెడీగా ఉండేవారు. అలాగే సినిమాలో తన పాత్ర విషయంలో కూడా ఎంతో క్రమశిక్షణగా అంకితభావంతో పని చేసేవారు. అలా ఆయన దగ్గర నుంచి నేను సమయపాలన క్రమశిక్షణ గా ఎలాగ ఉండాలో నేర్చుకున్నాను. నేను నటిగా 10 సంవత్సరాల కాలం ఎలా గడిచిపోయిందో నాకే తెలియదు. స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా ఉండే దానిని. ఆ టైంలో జరిన కొన్ని విషయాలు నాకు అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయని ఆమె చెప్పుకొచ్చారు.