అచ్చెన్న అష్టదిగ్బందనం..వైసీపీ సూపర్ స్కెచ్..!

రెండోసారి కూడా గెలిచి అధికారం దక్కించుకోవాలనే దిశగా వైసీపీ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా అధికారంలోకి రావడానికి రకరకాల వ్యూహాలతో ముందుకెళుతుంది..టీడీపీని దెబ్బతీయడానికి ప్రాంతాల వారీగా, కులాల వారీగా స్ట్రాటజీలు వేస్తూ…గెలవడమే లక్ష్యంగా రాజకీయం నడుపుతుంది. ఎక్కడకక్కడ టీడీపీకి చెక్ పెట్టే దిశగా పనిచేస్తుంది.

ఇక ఇటీవల వైసీపీ అంతర్గత సర్వేలో..టీడీపీ ఖచ్చితంగా 40 సీట్లలో గెలుస్తుందని తేలిందట..ఆ స్థానాలపై కాకుండా మిగిలిన 135 స్థానాలపై పూర్తిగా ఫోకస్ పెట్టాలని చెప్పి వైసీపీ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. అయితే వైసీపీ సర్వేలో…టీడీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లలో టెక్కలి లేదని తేలింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్నాయుడు..ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనని ఎలాగైనా ఓడించాలనే దిశగా వైసీపీ వ్యూహాలు రచిస్తుందట. మరొకసారి అచ్చెన్న గెలవకుండా ఉండాలనే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుందట.

ఇందులో భాగంగా అచ్చెన్నని అన్నిరకాలుగా అష్టదిగ్బందనం చేయడమే టార్గెట్‌గా వైసీపీ ముందుకెళుతుందట. గత మూడు నెలల నుంచే వైసీపీ తమ స్కెచ్ అమలు చేయడం మొదలుపెట్టినట్లు  తెలిసింది. ఇందులో భాగంగా మొదట టెక్కలిలో గ్రామ స్థాయిలో బలంగా ఉన్న టీడీపీ నాయకులని వైసీపీలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారట. అలాగే ఇక్కడ కులాల వారీగా ఓట్లలో చీలిక తేవడానికి చూస్తున్నారు.

ముఖ్యంగా  టెక్కలిలో ఎక్కువగా ఉన్న కళింగ, మత్స్యకార, రెడ్డికా కులాల ఓట్లు అచ్చెన్నకు పడకుండా, వైసీపీకి పడేలా కుల చిచ్చు రేపేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇక్కడ ప్రస్తుతం ఇంచార్జ్‌గా దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. ఈయన అనుకున్న మేర బలపడలేదని తెలుస్తోంది. పైగా ఎప్పుడు ఏదొక వివాదాల్లో ఉంటున్నారు. అందుకే మళ్ళీ టెక్కలిలో అభ్యర్ధిని మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని టెక్కలిలో పోటీకి దింపవచ్చని  తెలుస్తోంది. టెక్కలిలో అత్యధిక ఓట్లు ఉన్న కళింగ వర్గానికి చెందిన మహిళా నేత..దీంతో టెక్కలిలో ఈమెని బరిలో పెడితే అచ్చెన్నకు చెక్ పెట్టొచ్చు అనేది వైసీపీ స్కెచ్‌గా ఉంది. మరి చూడాలి టెక్కలిలో అచ్చెన్నని ఎంతవరకు నిలువరించగలుగుతారో.