తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇమే ఎప్పుడు ఎలాంటి వివాదాలలో కూడా తల దూర్చదని చెప్పవచ్చు. అయితే ఈమె పైన కొంతమంది రాజకీయ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై బ్రాహ్మణి పరువు నష్టం దావా దాఖలు చేయనున్నారని తెలుగుదేశం పార్టీ అధికారులు నిన్నటి రోజున ప్రకటించడం జరిగింది. నారా బ్రాహ్మణి ఒక నిరుపేద అని అటువంటి మహిళా దగ్గర రూ.1600 కోట్లతో జయలలితకు సంబంధించిన ఒక ఫామ్ హౌస్ ని కొనబోతున్నారని అంతటి డబ్బులు ఆమెకు ఎక్కడి నుంచి వచ్చాయంటూ సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు చేసిన పలు పోస్టులు వైరల్ గా మారాయి.
ఈ పోస్టులపై టిడిపి ప్రస్తావించింది.ఈ మేరకు టిడిపి అధినేత తన ట్విట్టర్ నుంచి ఒక పోస్టును షేర్ చేయడం జరిగింది. తనపైన తన భార్య పైన ఎవరు ఏ ఆరోపణలు చేసిన..పోలీసు బలగాన్ని పంపి కేసులు పెట్టించే జగన్ రెడ్డి.. స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబ మహిళలపై ఫేక్ ప్రచారాలు చేయిస్తున్నారు. తనకు ధర్మం ఎదుటి వాళ్లకు ఇంకో ధర్మం ఏంటో తెలుసుకోవడానికి రంగం సిద్ధమవుతోంది అంటూ ఒక కొటేషన్ ని షేర్ చేస్తూ ఫోటోని షేర్ చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత.
నారా బ్రాహ్మణి గారు నిరుపేద అని అటువంటి మహిళ రూ.1600 కోట్ల రూపాయలు పెట్టి జయలలితకు సంబంధించిన ఫామ్ హౌస్ కొంటున్నారంటూ వైసీపీ పేటీఎం బ్యాచ్లో కొంతమంది ఫేక్ పోస్టులు పెట్టారు వారి పైన పరువు నష్టం దావా వేసేందుకు నారా బ్రాహ్మణి సిద్ధమవుతున్నారని టిడిపి ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది. మరి ఈ విషయంపై వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.
తన పైనా తన భార్య పైనా ఎవరు ఏ ఆరోపణలు చేసినా పోలీసు బలగాన్ని పంపి కేసులు పెట్టించే జగన్ రెడ్డి… స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబ మహిళలపై ఫేక్ ప్రచారాలు చేయిస్తున్నాడు. తనకో ధర్మం ఎదుటివాళ్లకు ఇంకో ధర్మం ఏంటో తేల్చుకోడానికి రంగం సిద్ధమవుతోంది(1/2)#YCPpaytmBatch#FakeYCPBatch pic.twitter.com/sKd7XafOCi
— Telugu Desam Party (@JaiTDP) October 25, 2022