రీ రిలీజ్ మూవీ తో వచ్చిన డబ్బులను బాలయ్య ఏం చేశారంటే..?

గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ లో రీ రిలీజ్ మూవీల సందడి కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ రీ రిలీజ్ అనే పద్ధతికి తెరలేపింది మాత్రం మహేష్ బాబు అభిమానులని చెప్పాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో మహేష్ బాబును ట్రెండ్ చేయడానికి ఆయన అభిమానులు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ సినిమా పోకిరి సినిమాను రిలీజ్ చేసి కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించారు. ఇక ఇదే పద్ధతిని మిగతా హీరోల అభిమానులు కూడా ఫాలో అయ్యారు ఇక ఈ క్రమంలోనే బాలయ్య 2002 సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ చేసిన చెన్నకేశవరెడ్డి సినిమాని కూడా ఇటీవల రీ రిలీజ్ చేశారు.

వివి వినాయక దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన బాలకృష్ణ.. హీరోయిన్లుగా శ్రీయ, టబు నటించారు. ఇకపోతే బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ బ్లాక్ బస్టర్ సినిమాను ఆయన అభిమానులు ఈ ఏడాది 2022 సెప్టెంబర్ 26వ తేదీన థియేటర్లలో రీ రిలీజ్ చేయగా.. ఈ సినిమాకు భారీ స్పందన లభించింది. అంతేకాదు కలెక్షన్ పరంగా కూడా మంచి వసూలు రాబట్టిందని చెప్పవచ్చు. ఇక బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా స్పెషల్ షోస్ ద్వారా రూ.5.39 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

అయితే ఈ డబ్బులు ఎవరు తీసుకున్నారు ? ఏం చేశారు? అనే విషయానికి వస్తే బాలకృష్ణ హైదరాబాదులో ఏర్పాటు చేసిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు ఈ డబ్బును డొనేట్ చేసినట్లు సమాచారం. ఇక ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వెల్లడించారు.ఇక ఇలా రీ రిలీజ్ ద్వారా వచ్చిన డబ్బును వృధా చేయకుండా కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడడానికి హాస్పిటల్ కి డొనేట్ చేయడం చాలా హర్షదాయకమని చెప్పవచ్చు . ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బాలకృష్ణ, బెల్లంకొండ సురేష్ లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.