అన్ని కోట్లు ఖర్చుపెట్టి గుడి కట్టిస్తున్న దిల్ రాజు కారణం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ పరిశ్రమ మీద తనకు ఉన్న మక్కువతోనే ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చి సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దిల్ రాజు నిజామాబాద్ జిల్లాలోని నరసింగపల్లి అనే గ్రామంలో వెంకటరమణారెడ్డి కుమారుడిగా జన్మించారు. మొదట సినీ డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన దిల్ రాజు దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. ఇక ఆ తర్వాత తన చేపట్టిన సినిమాలు అన్ని మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. దాంతో తన పేరును ఇంటిపేరుగా మార్చేసుకున్నారు.

Dil Raju is to Become a Father Again? What We Know
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న దిల్ రాజు మొదటి నుంచి వెంకటేశ్వర స్వామికి వీరభక్తుడు. అందుకు తగ్గట్టుగానే ఆయన బ్యానర్ పేరు కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ పేరును పెట్టుకుని దానిమీద పలు సినిమాలను నిర్మిస్తూ ఉన్నారు.

Dil Raju Invited Media to Visit Venkateswara Swami Temple in his hometown |  సొంత ఊరిలో దిల్ రాజు వెంకటేశ్వర స్వామి నిర్మాణం.. అద్భుతంగా ఉందంటూ  కామెంట్స్! News in Teluguఅయితే ఇలా బ్యానర్ పెట్టుకున్నప్పటి నుంచి తన సొంత గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని దిల్ రాజు సంకల్పించారు. అలా 2010లో ఈ గుడిని ప్రారంభించారు ఎట్టకేలకు ఈ గుడి పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Producer Dil Raju and His Wife Tejaswini Visuals @ Tirumala | MS  entertainments - YouTube
ఈ గుడిని సందర్శించడానికి వెళ్లిన దిల్ రాజు అక్కడ మీడియాతో మాట్లాడినట్లుగా సమాచారం .తన సొంత గ్రామానికి తీసుకువెళ్లి అందరికి ఆ గుడిని చూపించడం జరిగిందట. దీంతో ఈ గుడిని చూసిన మీడియా ప్రతినిధులు కూడా ఎంతో అద్భుతంగా ఉందని తెలియజేసినట్లు సమాచారం. ఈ గుడి కోసం దాదాపుగా రూ.5 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. దిల్ రాజు ఇక తన మొదటి భార్య చనిపోవడంతో వైషు రెడ్డి అని యువతీని వివాహం చేసుకున్నారు ఇటీవల ఆమె ఒక మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది.