మదనపల్లెలో వైసీపీ కోసం తమ్ముళ్ళ కష్టం..!

అందివచ్చిన అవకాశాలని కాలదన్నుకోవడంలో టీడీపీ నేతలని మించిన వారు లేరనే చెప్పొచ్చు. నెక్స్ట్ అధికారంలోకి రావాలని ఓ వైపు అధినేత చంద్రబాబు తెగ కష్టపడుతున్నారు…కానీ ఆయనకు అండగా నిలబడి..పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన నేతలు మాత్రం..సరిగ్గా పనిచేయకుండా పార్టీకి ఇంకా డ్యామేజ్ చేస్తున్నారు. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది..అలా వ్యతిరేకత ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా టీడీపీకి ప్లస్ అవుతుంది.

కానీ ఆ వ్యతిరేకతని కూడా సరిగ్గా ఉపయోగించుకోవడంలో టీడీపీ నేతలు ఫెయిల్ అయ్యి..మళ్ళీ వైసీపీకే ప్లస్ చేస్తున్నారు. సరిగ్గా మదనపల్లె నియోజకవర్గంలో ఇదే జరుగుతుంది. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఉన్న ఈ స్థానంలో గతంలో టీడీపీ మంచి విజయాలే సాధించింది. కానీ 2009 నుంచి ఇక్కడ విజయాలు అందుకోలేకపోతుంది. 2014లో ఈ సీటు బీజేపీకి కేటాయించడం వల్ల వైసీపీ ఈజీగా గెలిచింది.

2019లో వైసీపీ గాలిలో ఇక్కడ మహమ్మద్ నవాజ్ బాషా మంచి మెజారిటీతో గెలిచారు. అయితే మూడున్నర ఏళ్లలో ఈయనపై వ్యతిరేకత వచ్చింది..అభివృద్ధి లేదు. ఇక్కడ వైసీపీకి యాంటీ కనిపిస్తోంది. ఆ యాంటీని ఉపయోగించుకుని టీడీపీ బలపడే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఇంచార్జ్‌గా ఉన్న దొమ్మాలపాటి రమేష్..అనుకున్న రీతిలో ఇక్కడ పుంజుకోలేకపోయారు.

ఆ మధ్య మినీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కానీ ఆ ఊపుని తర్వాత కొనసాగించలేకపోయారు. దీని వల్ల టీడీపీకి ప్లస్ అవ్వట్లేదు. పైగా ఇక్కడ గ్రూపు తగాదాలు ఉన్నాయి. కొందరు ఎవరికి వారు సెపరేట్ గా రాజకీయం నడుపుతున్నారు. దీని వల్ల మదనపల్లెలో పార్టీ పికప్ అవ్వడం లేదు. అంటే పరోక్షంగా టీడీపీ నేతలే వైసీపీకి ప్లస్ అవుతున్నారు.

ఇకనుంచైనా టీడీపీ నేతలు కలిసికట్టుగా పనిచేస్తే..టీడీపీ బలం పెరుగుతుంది..ఎన్నికల్లోపు పుంజుకునే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఇదే తరహాలో ముందుకెళితే…మదనపల్లె సీటుని మరోసారి కోల్పోవాల్సి వస్తుంది.