టీడీపీ ఇంచార్జ్ బ్లాక్‌మెయిల్..బాబు రివర్స్?

ఏ ప్రాంతీయ పార్టీలోనైనా..ఆ పార్టీ అధినేత చెప్పేదే చేయాలి..అధినేత మాటని దాటి ఏ నాయకుడు సొంతంగా ముందుకు వెళ్లలేరు. అలా పార్టీ లైన్ దాటి వెళితే వేటు తప్పదు. అయితే ఎంతటి నాయకుడినైనా కంట్రోల్ చేసే సత్తా వైసీపీ అధినేతగా ఉన్న జగన్‌కు ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఆయన ఏం చెబితే అదే జరగాలి. కాదని ముందుకెళితే పరిణామాలు వేరుగా ఉంటాయి. కానీ టీడీపీలో ఈ పరిస్తితి కాస్త వేరుగా ఉంటుంది. అధినేత చంద్రబాబు మాటని కొందరు ధిక్కరిస్తారు కూడా..అయినా సరే బాబు వారిపై చర్యలు తీసుకునే విషయంలో ఆలోచిస్తారు.

ఏం చేస్తే ఏం ఇబ్బందులు వస్తాయనే భయం బాబులో ఉంటుంది…కానీ ఆ భయం జగన్‌లో ఉండదు. తన మాట కాదన్న వారిని పక్కన పెట్టేస్తారు. అయితే బాబు ఆ ఇబ్బంది ఉండదు కాదు కాబట్టి..కొందరు టీడీపీ నేతలు కొన్ని సందర్భాల్లో బ్లాక్ మెయిల్ చేయడానికి సిద్ధమవుతారు. ఇటీవల కూడా ఓ ఇంచార్జ్ …తనకు సీటు ఇవ్వకపోతే..తన సామాజికవర్గాన్ని రెచ్చగొట్టి, ఆ ఓట్లని టీడీపీకి దూరం చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిసింది. ఆ ఇంచార్జ్ ఎవరు అనేది క్లారిటీ రావడం లేదుగాని..గత ఎన్నికల్లో గెలిచిన సీటుకు సంబంధించిన ఇన్చార్జ్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

అంటే టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన వారి స్థానంలో ఇంచార్జ్‌గా నియమించబడిన నేత బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారట. టీడీపీ నుంచి వైసీపీకి నలుగురు ఎమ్మెల్యేలు వెళ్లారు. ఆ నలుగురు వెళ్ళిన స్థానాల్లో ఇంచార్జ్‌లని కూడా పెట్టారు. గన్నవరంలో బచ్చుల అర్జునుడు, గుంటూరు వెస్ట్‌లో కోవెలమూడి రవీంద్ర, విశాఖ సౌత్‌లో గండి బాబ్జీ, చీరాలలో కొండయ్య యాదవ్. వీరిలో బాబుని బ్లాక్ మెయిల్ చేసేది ఎవరు అనేది తెలియడం లేదు. అయితే బీసీ వర్గానికి చెందిన నేత అని ప్రచారం ఉంది. ఆ నేత ..సీటు ఇవ్వకపోతే తన వర్గాన్ని టీడీపీకి దూరం చేస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని కొందరు భావిస్తారు. దీంతో ఆ ఇంచార్జ్ సామాజికవర్గానికి చెందిన నేతనే కొత్తగా ఇంచార్జ్‌గా పెట్టి, బ్లాక్ మెయిల్ చేసే ఇంచార్జ్‌కు చెక్ పెట్టాలని బాబు భావిస్తున్నారని తెలుస్తోంది.