అలాంటి సీన్స్ కోసం గొడవకు దిగిన ఎన్టీఆర్.. కట్ చేస్తే..!!

టాలీవుడ్ సినీ పరిశ్రమలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నందమూరి తారక రామారావు నటసార్వభౌముడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలన్నీ కూడా తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా చెరగని ముద్ర వేసుకున్నాయి. ముఖ్యంగా జానపద, సాంఘిక, పౌరాణిక , చారిత్రక జానర్ లలో ఎన్నో సినిమాలను తెరకెక్కించిన అన్నగారు ప్రేక్షకుల మది లో అలుపెరుగని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపోతే సినిమాలలో ప్రేక్షకులు బాగా గుర్తుతెచ్చుకునే సినిమాలలో పాతాళభైరవి సినిమా కూడా ఒకటి.

Pathala Bhairavi Telugu Full Length Movie || NTR, K.Malathi - YouTube

ఇక ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో అతిపెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. ఇది కేవలం సినిమా అనడం కంటే ఒక పెద్ద కళాఖండం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. ఇక ఈ సినిమాలో విలక్షణ నటుడు ఎస్.వి.రంగారావు మాయావి పాత్ర పోషించి, తన నటనతో అద్భుతం సృష్టించారు. ఇక సినిమా ఎంతోమందికి లైఫ్ ఇవ్వడమే కాకుండా ఇండస్ట్రీ పేరును కూడా ఎల్లలు దాటించింది. ఇక ఈ సినిమాలో రేలంగి విలన్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు ఇకపోతే పాతాళ భైరవి సినిమా కోసం కర్రసాము కూడా నేర్చుకున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వచ్చిన కుస్తీ వస్తాది వద్ద కుస్తీ పట్టడం ఎలాగో కూడా నేర్చుకున్నారు.

Pathala Bhairavi Full Movie Climax - YouTube

ఇదిలా ఉండగా పాతాళభైరవి సినిమాలో కుస్తీ పోటీలు చాలా సన్నివేశాలలో కనిపించినా కర్ర సాము మాత్రం కేవలం ఒకే ఒక్క సన్నివేశంలో కనిపిస్తుంది.. అంజి అనే పాత్రధారిగా ఎన్టీఆర్ కర్ర సామ చేస్తారు. ఆ ఒక్క సన్నివేశంలోనే కర్ర సాము ఉంటుంది. కానీ ఇందుకోసం రెండు నెలల పాటు శ్రమించి కర్ర సాము నేర్చుకున్నారు ఎన్టీఆర్.. అంతేకాదు కర్ర సాము నేర్చుకుంటున్న సమయంలో నడుం పట్టేసి రెండు రోజులు బెడ్ రెస్ట్ కూడా తీసుకున్నాడు. అంత కష్టపడి కర్ర సాము నేర్చుకుంటే ఈ సినిమాలో ఒకే సీన్లో ఇలాంటి సన్నివేశం ఉండడంతో అన్నగారు ఆగ్రహంతో ఊగిపోయారు. ముఖ్యంగా మూడు సన్నివేశాలకు సంబంధించి కర్ర సాము షూటింగ్ చేస్తే మొత్తం ఎడిటింగ్ లో తీసేసి ఒక్క సీన్ మాత్రమే వచ్చింది. దీంతో దర్శకుడు పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్టీఆర్ ఇక ఆ తర్వాత ఆయన ఏ సినిమాలో కూడా కర్ర సాము చేయలేదు.