మోదీ మెచ్చిన కాంతారా.. రిషబ్ శెట్టికి అదిరిపోయే న్యూస్..!

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలంటే ఎంతో గొప్పగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ సినిమాల స్థానాన్ని సౌత్ సినిమాలు భర్తీ చేస్తున్నాయి .ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమాలు అన్నంత గా సౌత్ సినిమాల హవా నడుస్తుంది. నార్త్ పేక్షకులు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల సినిమాలను చూడడానికి ఇష్టపడుతున్నారు. సినిమా బాగుంటే సౌత్- నార్త్ అనే బేధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. సౌత్ నుంచి వచ్చిన బాహుబలి 1, బాహుబలి 2, కే జి ఎఫ్ 1, కే జి ఎఫ్ 2 ఈ సినిమాలన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఈ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో ప్రతి భాషలోనూ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలు కి ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏ సినిమాలో అయిన‌ కథ కథనం బాగుంటే చాలు ఆ సినిమాలను ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నామని అభిమానులు నుంచి ఇండికేషన్లో వస్తున్నాయి.

After Kantara, Rishab Shetty to collaborate with Allu Aravind for a Telugu  film. Deets inside - India Today

కథ కథనం కంటెంట్ ఉన్న సినిమాలను ఒక భాషలోనే కాకుండా అన్ని భాషల్లో డబ్బింగ్ చేస్తున్నారు.. ఇక వాటినే పాన్ ఇండియా సినిమా లాగా పిలుచుకుంటున్నారు. ఆ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. ఇక ఇటీవల కన్నడ నుంచి విడుదలైన కాంతారా సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదలైన ప్రతి భాషలోనూ సూపర్ హిట్ అవుతూ భారీ కలెక్షన్లను కొల్లగొడుతుంది. ఈ సినిమాను నార్త్‌ ఆడియన్స్ కూడా బాగా నచ్చింది. ఈ సినిమా ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో 230 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి నిర్మాతలకు కాసులు వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమాలలో ఒకటిగా నిలుస్తుంది. ప్రస్తుతానికి ఈ సినిమా కేజీఎఫ్ సిరీసుల సరసన నిలుస్తోంది.

PM Modi to enjoy blockbuster film | cinejosh.com
అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఈ సినిమాను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే ఈ సినిమాని వీక్షించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను ఆయనతో పాటు ఈ సినిమా దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టి కూడా కలిసి ప్రత్యేకంగా తిలకించునన్నాడని తెలుస్తుంది. మోదీ ఈ సినిమాను నవంబర్ 14న వీక్షించునున్నారని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇప్పటికే భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న కాంతారా సినిమాకు ఇది మరింత హైప్ ఇచ్చే న్యూస్ గా కనిపిస్తుంది. ఇక ఈ సినిమా చూస్తే ప్రధాని ఏ విధంగా స్పందిస్తారో అనేది కూడా ఆసక్తిగా మారింది.