ఈమధ్య కాలంలో తెలుగులో ఎక్కువగా లాభాలు తీసుకొచ్చిన సినిమాల లిస్ట్ ఇదే!

కరోనా తరువాత అనేక పరిశ్రమలు కుదేలు అవుతున్నవేళ, తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రం మంచి మంచి సినిమాలతో సత్తా చాటింది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ సినిమాలనేవి వినోదాత్మకంగా నిర్మింపబడతాయి. ఓ కోటి రూపాయిలు పెట్టిన నిర్మాతకు ఓ మూడు నాలుగు కోట్లు వస్తే సినిమా హిట్ కింద పరిగణిస్తారు. నిర్మాతలు చాలా ఖుషి అవుతారు. అయితే ఈమధ్యకాలంలో మనదగ్గర హిట్టైన కొన్ని సినిమాల గురించి ఇక్కడ చూద్దాము. ఈ నేపథ్యంలో ముందుగా RRR సినిమా గురించి మాట్లాడుకోవాలి.

ఈ యేడాది రిలీజై అంత్యంత ప్రజాదరణ పోయిందిన సినిమాలలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా RRR మూవీ ఎలాంటి రికార్డులు షురూ చేసిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను సాధించిన మూవీగా రికార్డులకు ఎక్కింది. అలాగే ఇటీవల విడుదలైన కార్తికేయ 2 కూడా ఎక్కువ లాభాలు తీసుకొచ్చింది. మొత్తంగా తెలుగులో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాల విషయానికొస్తే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా.. రూ. 100కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది.

ఆ తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన మూవీ ‘ఎఫ్ 2’ మూవీ. ఈ సినిమా రూ. 34.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా దాదాపు రూ. 80 కోట్ల వరకు షేర్ సాధించింది. ఈ సినిమా ఓవరాల్ గా రూ. 50 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. అలాగే అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఏపీలో తప్ప మిగతా అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్‌కు నిర్మాతలకు లాభాలను తీసుకొచ్చింది. రూ. 144 .9 కోట్ల ప్రీ రిలీజ్ చేసిన ఈ సినిమా 6 వారాల్లో ఈ సినిమాకు రూ. 177.16 కోట్ల షేర్ వచ్చింది.