ఆళ్లగడ్డలో ట్విస్ట్..టీడీపీలో ఊహించని మార్పు?

ఆళ్లగడ్డ అంటే భూమా ఫ్యామిలీనే గుర్తొస్తుంది. ఆ నియోజకవర్గానికి కంచుకోటగా భూమా ఫ్యామిలీ మార్చుకుంది. వాళ్ళు ఏ పార్టీలో ఉంటే..ఆ పార్టీలో గెలిచేవారు. కానీ గత ఎన్నికల్లోనే ఆళ్లగడ్డ భూమా ఫ్యామిలీ చేతుల్లో నుంచి జారిపోయింది. అనూహ్యంగా ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ పోటీ చేసి ఓడిపోయారు. అయితే కొంతకాలం ఆమె యాక్టివ్ గానే తిరిగారు. కానీ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల యాక్టివ్ గా లేరు. అటు కొన్ని వివాదాలు కూడా భూమా ఫ్యామిలీ చుట్టూ నడిచాయి.

దీంతో ఆళ్లగడ్డలో టీడీపీ బలం పెరగలేదు. పైగా పలు రకాలుగా కన్ఫ్యూజన్ వచ్చింది. అఖిలప్రియ బలం పెరగకపోవడంతో టీడీపీ అధిష్టానం ఆళ్లగడ్డలో ఊహించని మార్పు చేయడానికి సిద్ధమైందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే భూమా కిషోర్ రెడ్డితో ఇటీవల కొందరు టీడీపీ పెద్దలు భేటీ అయ్యి, పార్టీలోకి తీసుకురావడానికి ట్రై చేశారని తెలిసింది. కిషోర్ రెడ్డి ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నారు. బీజేపీలో ఉన్నా సరే వ్యక్తిగతంగా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు.

దీంతో కిషోర్‌తో టీడీపీ పెద్దలు చర్చలు జరిపారని  తెలిసింది. అటు కిషోర్ సైతం టీడీపీలోకి రావడానికిస సానుకూలంగానే ఉన్నట్లు ప్రచారం వచ్చింది. కాకపోతే అఖిలప్రియకు నచ్చజెప్పాల్సి ఉంటుంది..లేదా ఆమెని ఆళ్లగడ్డలోనే ఉంచి..కిషోర్‌కు వేరే సీటు ఇవ్వాలి. అటు నంద్యాల సీటులో భూమా బ్రహ్మానంద రెడ్డి ఎలాగో ఉన్నారు. కానీ ఆయన్ని సైడ్ చేసి తన సొంత సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డికి సీటు ఇప్పించుకోవాలని అఖిల ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.

కానీ ఇటు అఖిలకు ఆళ్లగడ్డ సీటు డౌట్‌లో ఉంది..అఖిల కంటే కిషోర్‌ని టీడీపీలోకి తీసుకొచ్చి ఆళ్లగడ్డ బరిలో నిలబడితే బెటర్ అని తెలుస్తోంది. అందుకే టీడీపీ అధిష్టానం..కిషోర్‌కు టచ్‌లో ఉంది. మొత్తానికి చూసుకుంటే ఆళ్లగడ్డ, నంద్యాల సీట్లలో కన్ఫ్యూజన్ ఉంది. భూమా ఫ్యామిలీలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకునేలా ఉంది. మరి చివరికి ఎవరికి సీటు ఇస్తారో చూడాలి.