విజయ్ దేవరకొండ ని మార్చేసిన ఆ సినిమా ఏంటో తెలుసా..?

విజయ్ దేవరకొండ అంటే దూకుడు కి మారుపేరు అని చెప్పవచ్చు. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఇప్పటిదాకా ఏ హీరోలో చూడని యాటిట్యూడ్ ఈ తరం యువతకు ఫేవరెట్ హీరోగా మారిపోయారు. ఇక సినిమాలో అతని నటనకు మించి బయట ఎక్కువగా ఆటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు. దీంతో తన మీద ఎన్నోసార్లు ట్రోల్స్ జరగడం కూడా జరుగుతోంది. గీతా గోవిందం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో తన మీద సెటైర్లు తానే వేసుకున్నారు. ఆ తర్వాత టాక్సీవాలా సినిమా షో నడుస్తున్న థియేటర్ కి వెళ్లి ప్రేక్షకులందరికీ క్యాంటీన్ బిల్ పే చేసి అందరికీ షాక్ ఇచ్చారు.

First look of Vijay Devarkonda's Bollywood debut 'Liger' unveiled
ఇలా తను తెచ్చుకున్న పాపులారిటీకి సినిమాలకు ఇచ్చిన ప్రమోషన్స్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. కొంతమంది హీరోలు ఇతన్ని అనుసరించే ప్రయత్నం చేసినా కూడా అది విఫలం అయింది. అయితే ఇలాంటివన్నీ సక్సెస్ వచ్చినప్పుడు ఏం చేసినా చెల్లుతుంది. కానీ ఫెయిల్యూర్ సమయంలో మాత్రం కాస్త నిర్ణయాలు మారుస్తూ ఉండాలని చెప్పవచ్చు. ముఖ్యంగా లైగర్ సినిమా ఫెయిల్యూర్ విజయ్ ని ఒక్కసారిగా మార్చేసిందని చెప్పవచ్చు. అతనిని దగ్గరగా గమనిస్తున్న వారు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ముందు డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాలు భారీగా ఫెయిల్ అయ్యాయి.

Vijay's latest speech | Vijay devarakonda, South hero, Actors

ఆ చిత్రాలు ఏవి విజయ్ కెరీర్ మీద ప్రభావం చూపలేదు కానీ. లైగర్ చిత్రం ప్రమోషన్లలో చాలా కాన్ఫిడెంట్ గా ఆటిట్యూడ్ గా కనిపించారు. కానీ ఈ సినిమా గురించి ఒక రేంజ్ లో చెప్పి విపరీతమైన బిల్డప్ ఇచ్చి చివరికి సత్తా చాట లేకపోవడంతో.. విజయ్ పైన ట్రోలింగ్ జరిగాయని తెలియజేశారు. దీంతో షాక్ అయిన విజయ్ ఆ తర్వాత భిన్నంగా కనిపిస్తున్నారని సైమా వేడుకలలో తను మాట్లాడినప్పుడు ఏడుపు ఆపుకుంటున్నట్లుగా కనిపించింది అని సమాచారం. దీంతో విజయ్ మళ్ళీ హిట్ కొట్టే వరకు తన యాటిట్యూడ్ చూపించరని పలువురు నెటిజన్లు తెలియజేస్తున్నారు.