అభ్యర్ధుల లిస్ట్..కృష్ణా టీడీపీలో చిచ్చు..!

సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తప్ప అధికారికంగా ఏ ఇంచార్జ్ కూడా చంద్రబాబు సీటు ఫిక్స్ చేయలేదని, ఎవరు కూడా సీటు వచ్చిందని ప్రకటించుకోవడం కరెక్ట్ కాదని ఇటీవలే టీడీపీ జాతీయ కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది. అంటే అధికారికంగా ఎవరికి సీటు ఫిక్స్ కాలేదు. కాకపోతే చంద్రబాబు..నియోజకవర్గ ఇంచార్జ్‌లతో సమావేమవుతూ..ఈ సారి గెలిచి తీరాలని కొందరికి చెబుతున్నారు. దీంతో వారికి సీటు ఫిక్స్ అని ప్రచారం జరుగుతుంది.

అయితే ఇక్కడ అధికారికంగా ప్రకటన ఇవ్వట్లేదు. ఇలా ముందుగానే సీటు ఫిక్స్ అని ప్రచారం వల్ల పార్టీలో విభేదాలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు ఆ మధ్య ప్రొద్దుటూరు సీటు తనకే ఇచ్చారని ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ర్యాలీ కూడా పెట్టుకున్నారు. కానీ సీటు ఇవ్వలేదని అదే నియోజవర్గానికి చెందిన లింగారెడ్డి చెప్పుకొచ్చారు. సీటు దక్కే అర్హత తనకే ఉందని చెప్పుకొచ్చారు. ఇలా అక్కడ రెండు వర్గాల మధ్య విభేదాలు వచ్చాయి.

ఇదిలా ఉంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీట్లు ఫిక్స్ అయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. కొన్ని వెబ్ మీడియా సంస్థలు కూడా కథనాలు ఇస్తున్నాయి. ఆ కథనం ప్రకారం..మైలవరంలో దేవినేని ఉమా, జగ్గయ్యపేట-శ్రీరామ్ తాతయ్య, నందిగామ-సౌమ్య, విజయవాడ తూర్పు-గద్దె రామ్మోహన్, సెంట్రల్-బోండా ఉమా, వెస్ట్-కేశినేని నాని లేదా కేశినేని కుమార్తె, తిరువూరు-ఉప్పులేటి కల్పన/వాసం మునయ్య, నూజివీడు-పొన్నాల అనిత/ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, మచిలీపట్నం-కొల్లు రవీంద్ర, పెడన-కొనకళ్ళ నారాయణ, అవనిగడ్డ – మండలి బుద్ధప్రసాద్, పెనమలూరు-బోడే ప్రసాద్, పామర్రు-వర్ల కుమార్ రాజా, గన్నవరం గద్దె అనురాధా/యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ-రావి వెంకటేశ్వరరావు(డౌట్) అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది.

ఇటు ఎంపీ సీట్లు వచ్చి విజయవాడ-కేశినేని శివనాథ్(చిన్ని), మచిలీపట్నం-బాడిగ శ్రీదేవి పోటీ చేస్తారని, చంద్రబాబు ఈ సీట్లు ఫిక్స్ చేశారని ప్రచారం చేస్తున్నారు. అయితే వీటిల్లో కొన్ని మాత్రమే నిజమవుతాయి..మిగిలినవి డౌటే. అయినా అధికారికంగా బాబు ఒక్క గద్దె రామ్మోహన్‌కు మాత్రమే సీటు ఫిక్స్ చేశారు. ఇక ఇలా లిస్ట్ రావడంతో కొన్ని స్థానాల్లో నేతల మధ్య విభేదాలు వచ్చేలా ఉన్నాయి.

ఉదాహరణకు పెడన ఇంచార్జ్‌గా కాగిత కృష్ణప్రసాద్ ఉన్నారు..ఆయన గట్టిగా కష్టపడుతున్నారు. కాగితకు కాకుండా కొనకళ్ళకు సీటు అని ప్రచారం వస్తుండటంతో..అక్కడ కాగిత వర్గంలో ఆందోళన మొదలైంది. దీని వల్ల గ్రూపు గొడవలు మొదలయ్యి పార్టీకే నష్టం జరిగే ఛాన్స్ ఉంది.