కమలాపురం టీడీపీలో ట్విస్ట్‌లు..నిలిచేదెవరు?

ఈ సారి జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాలో ఖచ్చితంగా సత్తా చాటాలనే దిశగా టీడీపీ పనిచేస్తుంది..గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు..కానీ ఈ సారి మాత్రం జిల్లాలో మూడు, నాలుగు సీట్లు అయిన గెలుచుకోవాలని భావిస్తుంది. టీడీపీ నేతలు ఇక్కడ బాగానే కష్టపడుతున్నారు..పైగా వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత టీడీపీకి బాగా కలిసొస్తుంది. అయితే జిల్లాలో ఐదు సీట్లపై టీడీపీ ఫోకస్ చేసింది. మైదుకూరు, ప్రొద్దుటూరు, రాజంపేట, కమలాపురం, రైల్వేకోడూరు లాంటి సీట్లలో పార్టీకి బలం కనిపిస్తోంది. ఈ సీట్లలో ఖచ్చితంగా గెలిచి తీరాలని చూస్తుంది.

అయితే ఇందులో కమలాపురం సీటు అనేది ఈజీ కాదు..మిగిలిన నాలుగుచోట్ల టీడీపీకి కాస్త బలం పెరిగినట్లు కనిపిస్తుంది గాని..కమలాపురంలో అనుకున్నంత బలం పెరగలేదు. ఎందుకంటే ఇక్కడ ఇంచార్జ్‌గా ఉన్న పుత్తా నరసింహారెడ్డి అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. పైగా ఇక్కడ ఎమ్మెల్యేగా జగన్ సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. ఆయనపై కాస్త వ్యతిరేకత ఉంది గాని..ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుని బలపడే స్టేజ్‌లో పుత్తా ఉన్నట్లు కనిపించడం లేదు

పైగా వరుసగా నాలుగుసార్లు ఓడిపోయారు..ఈ క్రమంలో ఈయనకు నెక్స్ట్ సీటు ఇచ్చే విషయం కూడా క్లారిటీ లేదు. లోకేశ్ ఇప్పటికే వరుసగా మూడుసార్లు పైనే ఓడిపోయినవారికి సీటు డౌటే అని చెప్పారు. ఆ ప్రకారం చూసుకుంటే పుత్తాకు సీటు గ్యారెంటీ లేదు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి..టీడీపీలో చేరి సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈయన టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్నారు. తాజాగా జైల్లో ఉన్న ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు.

అలాగే త్వరలో టీడీపీ చేరుతున్నట్లు ప్రకటించారు. ఇక ఈయన కమలాపురం సీటు ఆశిస్తున్నారు. గతంలో ఈయన టీడీపీలో పనిచేశారు. 1994, 2004 ఎన్నికల్లో కమలాపురం నుంచి టీడీపీ  తరుపున గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. తర్వాత టీడీపీతో క్లోజ్‌గా ఉంటూ వచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి ఆ పార్టీకి మద్ధతుగా నిలిచారు. కానీ ఆ పార్టీలో ప్రాధాన్యత లేదు..అందుకే టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. మరి కమలాపురం సీటు పుత్తాకు దక్కుతుందో, లేక వీరశివారెడ్డికి దక్కుతుందో చూడాలి.