వావ్:జపాన్ లో త్రిబుల్ ఆర్ సినిమా అరుదైన రికార్డ్.. ఇప్పటి వరకు ఏ సినిమాకు దక్కని గౌరవం..!!

త్రిబుల్ ఆర్ సినిమా అక్టోబర్ 21న జపాన్ లో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా విడుదలకు ముందు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఈ సినిమా ప్రమోషన్లలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. గత శుక్రవారం జపాన్ లో విడుదలైన త్రిబుల్ ఆర్ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా తొలి రోజు ఎవరూ ఊహించని ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.

ఇప్ప‌టి వరకు జపాన్ లో విడుద‌లైన ఏ ఇండియన్ సినిమాకు ఇలాంటి ఓపెనింగ్స్ రాలేదు. ఈ సినిమా జపాన్‌లో కొత్త రికార్డులను సృష్టించే విధంగా దూసుకుపోతుంది. ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం ఈ సినిమా తొలిరోజే దాదాపు 1.06కోట్లు వసూలు చేసింది. గతంలో ప్రభాస్ నటించిన సాహూ సినిమా మొదటి రోజు 90 లక్షలతో రికార్డు సృష్టించింది. ఆ రికార్డును ఇప్పుడు త్రిబుల్ ఆర్ బ్రేక్ చేసింది.

RRR' Japan version.. Stunning poster going viral!

ఈ సినిమా వారాంతపు వసూళ్లు అంచనావేస్తే ఐదు కోట్ల వరకు ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం త్రిబుల్ ఆర్ టీం జపాన్ లో సందడి చేస్తున్నారు. ఇక్కడ ఎన్టీఆర్ -రామ్ చరణ్ వారి అభిమానులను కలుసుకున్న ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అక్కడ ఉన్న అభిమానులు తమ అభిమాన హీరోలను చూడగానే ఆనందం వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.. ప్రేమని పలు రకాలుగా చూపిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలై 1100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇక ఇప్పుడు జపాన్‌లో మరి ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.