ఈనాడు ఎఫెక్ట్..జగన్ మాట వింటారా?

నేటి రాజకీయాల్లో తప్పు చేసినవాళ్లే…ఎదుటవాళ్ళు తప్పు చేశామని చెప్పడం అలవాటు అయిపోయింది. అంటే ఏదైనా నమ్మేస్తారనే కోణంలో నేతలు ఎక్కువ ఊహించుకుంటున్నారు. అది అధికార వైసీపీ నేతలైన, ప్రతిపక్ష టీడీపీ నేతలైన…లేదా జనసేన వాళ్ళు అయినా సరే..అంటే ప్రజలకు ఏమి తెలియదు తాము చెప్పేది కరెక్ట్ అని, అది జనం నమ్ముతారని భావిస్తున్నారు.

ముఖ్యంగా సీఎం జగన్ అదే కోణంలో ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ప్రజలకు తాము అన్నీ మంచి పనులే చేస్తున్నామని, కానీ టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా తమపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నాయనే భావనలో ఉన్నారు. తాజాగా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో జరిగిన సభలో కూడా జగన్ అదే తరహాలో మాట్లాడారు. ఇటీవల పవన్…వైసీపీ నేతలని ఉద్దేశించిన మాటలపై స్పందిస్తూ..” ప్రజలు వాళ్లని నమ్మడం లేదు. అందుకే వారు బూతులు మాట్లాడుతున్నారు. చెప్పులు చూపుతు న్నారు. తిట్లలో వీధి రౌడీలను మించిపోయారు. వీధి రౌడీలు కూడా అటువంటి మాటలు మాట్లాడతారో లేదో నాకు తెలియదు’’ అని జగన్ చెప్పుకొచ్చారు.

అలాగే మూడు రాజదనులు ముఖ్యం..మూడు పెళ్లిళ్లు కాదని పవన్‌పై సెటైర్ వేశారు. ఇక టీడీపీ అనుకూల మీడియా చెప్పేది నమ్మవద్దని, ఆ మీడియాని చూడవద్దని, పేపర్ చదవద్దని జగన్ చెప్పుకొచ్చారు. అయితే జగన్ చెప్పడానికి బాగానే చెప్పారు గాని..ఒక్కదానిలో కూడా లాజిక్ లేదు. ఎందుకంటే ఎవరు బూతులు తిడుతున్నారో జనాలకు తెలుసు. మొదట ఎవరు మొదలుపెట్టారో తెలుసు. ఆఖరికి వ్యక్తిగతంగా, ఫ్యామిలీలని కూడా లాగి తిడుతుంది ఎవరో తెలుసు.

పదే పదే తనని ప్యాకేజ్ స్టార్ అని, తన పెళ్లిళ్లు గురించి మాట్లాడుతుంటేనే పవన్ కౌంటర్ ఇచ్చారు. ఆయన కావాలని మాట్లాడింది కాదు..వైసీపీ నేతలు రెచ్చగొట్ట బట్టే. ఇక ఏ మీడియా ఎవరిదో జనాలకు బాగా క్లారిటీ ఉంది. ఎవరు ఏం చూపిస్తున్నారో తెలుసు. అయితే ఈనాడు సంస్థ ఈ మధ్య వరుసపెట్టి వైసీపీ నేతల అక్రమాలు అంటూ కథనాలు ఇస్తుంది..ఇవి వైసీపీకి బాగా మైనస్ అవుతున్నాయి. ఆ ఉద్దేశంతోనే జగన్..ఆ మీడియాని, పత్రికలని చూడొద్దని చెప్పినట్లు ఉన్నారు. అయినా ఎన్ని చెప్పినా జనాలకు అంటూ ఓ క్లారిటీ ఉంటుంది. ఏ మీడియా ఏంటి అనేది. కాబట్టి ఎంతగా చెప్పుకున్న యూజ్ ఉండదు.