మరొకసారి డాన్స్ తో రెచ్చిపోయిన కండక్టర్ ఝాన్సీ.. వీడియో వైరల్..!!

ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన వారిలో కండక్టర్ ఝాన్సీ కూడా ఒకరని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాలలో శ్రీదేవి డ్రామా కంపెనీ షో తో తన టాలెంట్ ను బయటపెట్టి బాగా పాపులర్ అయింది. ఆలా ఈవెంట్స్ లో డాన్స్ ప్రోగ్రాం చేసే ఝాన్సీ బాగా పాపులర్ అయిందని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా పలు ప్రైవేట్ సాంగ్ లో కూడా ఝాన్సీ మాస్ స్టెప్పులతో కుర్రకారులను సైతం పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఇక ఈ దెబ్బతో ఝాన్సీ మరింత పాపులర్ అవ్వడమే కాకుండా సినిమాలలో కూడా నటించే అవకాశాన్ని అందుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈమె గాజువాక డిపో కండక్టర్ గా పనిచేస్తున్నారు.

Gajuwaka Conductor Jhansi, Dancer Jhansi: The lady conductor who shook  Sridevi's drama company real life.

ఇక తనకు డాన్స్ అంటే ఇష్టమని అయితే బంధువులతో పాటు కొంతమంది వృత్తిని ఎంచుకున్నందుకు తనని చాలా అవమానించారని.. ఎన్నోసార్లు పలు షో లకు హాజరై చెప్పి అందరిని కదిలించింది. ముఖ్యంగా రమేష్ మాస్టర్ అనే వ్యక్తి జాన్సీ ని బాగా ప్రోత్సహించారని వాటితో పాటు ఒక టీమును కూడా ఏర్పాటు చేసి ప్రోగ్రాం ఇవ్వడం మొదలు పెట్టామని తెలియజేసింది. ఇక ఝాన్సీ డాన్స్ వీడియోలు సైతం యూట్యూబ్ లో ఎంతోమంది వీక్షిస్తూ ఉన్నారు. ఇలా సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయింది ఝాన్సీ.

Pulsar Bike Jhansi : రెచ్చిపోయి చిందులేసిన ప‌ల్స‌ర్ బైక్ ఝాన్సీ..  చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియో | The Telugu News

తాజాగా ప్రస్తుతం ఝాన్సీ డాన్స్ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది. ఒకవైపు కండక్టర్గా మరొకవైపు డాన్సర్ గా బ్రతుకు సాధిస్తున్న ఝాన్సీ గత పదకొండేళ్లుగా ఆంధ్రప్రదేశ్లోని ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంది. ఒకవైపు పేదరికం మరొకవైపు ఇంటి బాధ్యతలతో తన ఉద్యోగాన్ని చేస్తూనే తనకు ఇష్టమైన డ్యాన్సులు చేస్తూ ఉంటోంది ఝాన్సీ. అయితే ఇప్పుడు తాజాగా మరోక డాన్స్ తో చేసిన ఒక వీడియో చాలా వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Asi Jhansi (@pulsar_bike_jhansi)