నయనతార దంపతులకు ప్రభుత్వం నోటీసులు..!

లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార గత నాలుగు నెలల క్రితం అంటే జూన్ 9వ తేదీన మహాబలేశ్వరంలో ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ తన ప్రియుడు విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వివాహం జరిగి నాలుగు నెలలు కూడా పూర్తవకముందే వీరికి ఇద్దరు కవలలు పుట్టారు. ఇదే విషయాన్ని వీరు ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ తమ పిల్లలను ఆశీర్వదించాలని కోరగా సినీ ప్రముఖులు, పలువురు అభిమానులు, ప్రేక్షకులు కూడా ఈ దంపతులకు అభినందనలు తెలియజేశారు. అయితే వీరు వివాహం జరిగి నాలుగు నెలలు కూడా కాలేదు అలాగే ఇద్దరు కవలలు ఎలా జన్మించారు అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నయనతార దంపతులు సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చాము అని ప్రకటించిన విషయం తెలిసిందే

Vignesh Shivan confirms wedding with 'love of my life' Nayanthara. Here are all the details | Entertainment News,The Indian Express
అంతేకాదు ఇద్దరూ మగ పిల్లలు పుట్టడంతో వారికి ఉయిర్, ఉలగం అని పేర్లు కూడా పెట్టినట్లు తెలిపారు. ఇకపోతే కవలలు వచ్చిన తర్వాత తమ జీవితం ఎంతో మనోహరంగా.. ఉజ్వలంగా ఉంది అని ..తమ ప్రార్ధనలు పూర్వీకుల దీవెనలతో తమకు అంతా మంచే జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇదే విషయంపై ప్రముఖ సీనియర్ నటి కస్తూరి దేశంలో సరోగసిని నిషేధించారు అంటూ ఒక ట్వీట్ చేసింది. ప్రస్తుతం అది వైరల్ గా మారడమే కాకుండా దానిపై రకరకాల చర్చలు జరిగిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం దీనిపై స్పందించింది. సరోగసిపై వివరాలను అందజేయాలి అని నయనతార, విగ్నేష్ శివన్ దంపతులకు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ నోటీసులు పంపారు.

Nayanthara & Vignesh Shivan Welcome Parenthood Through Surrogacy; Why The Choice? - Filmibeat
సరోగసి సక్రమంగా జరిగిందా? లేదా? అన్నదానిపై వివరణ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. మరి ఈ విషయంపై నయనతార దంపతులు ఎలా రీయాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది . నిజానికి మనదేశంలో సరోగసి పద్ధతి అనేది చట్టరీత్యా నేరం. మహిళ గర్భం దాల్చలేని సందర్భంలో తప్ప అద్దెగర్భం ద్వారా తల్లిదండ్రుల అవ్వడం అనేది నేరం. ఇక ఈ ఏడాది జనవరి నుంచి ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఇక ఈ విషయంపై నటి కస్తూరి అలాగే కొంతమంది నెటిజన్లు కూడా ఫైర్ అవడంతో ప్రభుత్వం రంగంలోకి దిగినట్లు సమాచారం.