బయటకి నవ్వుతూ, నవ్వించే ఈ కమెడియన్ జీవితం ఎందుకిలా అయ్యింది?

మనకి వెండి తెరపైన నవ్వుతూ, నవ్వించే కమెడియన్ జీవితాలు ఎంతో ఆనందదాయకంగా వుంటాయని అనుకుంటూ ఉంటాము. కానీ అందరి విషయాల్లో అది జరగక పోవచ్చు. కొంతమంది కమెడియన్ జీవితాలలో చీకటే కనిపిస్తుంది మనకు. చార్లీ చాప్లిన్ జీవితమే దానికి ఉదాహరణ. ఇకపోతే మన తెలుగు పరిశ్రమలలో కామెడియన్లకు కొదువేమిలేదు. ఈ కమెడియన్స్ తమ మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ తెరపై నవ్వులు చిందిస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు. ఇకపోతే నిత్యం తన కామెడీతో ప్రేక్షకులను అలరించే ఓ తెలుగు కమెడియన్ జీవితంలో జరిగిన విషాదం తెలిస్తే మీకు కన్నీళ్లు ఆగవు.

అవును, అతను ఎవరో కాదు మాస్టర్ భరత్. రెడీ సినిమాలో బాలనటుడుగా అరంగేట్రం చేసిన మాస్టర్ భరత్ ఆ సినిమా తరువాత తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. వెంకీ, ఢీ, కింగ్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా 80 కి పైగా ఇక్కడ సినిమాలలో నటించి.. బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొని ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకున్నాడు. ప్రస్తుతం పెద్దవాడైన భరత్, ఆమధ్య అల్లు శిరీష్ నటించిన ఏబిసిడి చిత్రంలో సెకండ్ హీరోగా నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇకపోతే తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే భరత్ జీవితంలో ఒక విషాదం ఉంది. ఒక మీడియా వేదికగా మాట్లాడిన భరత్.. తన కుడి కన్ను కనిపించదు అని చెప్పి షాక్ ఇచ్చాడు. హీరోగా మారే ప్రయత్నంలో బరువు తగ్గడం కోసం చాలా కసరత్తులు చేసాడట. ఆ సమయంలో జరిగిన ఒక ప్రమాదం వల్ల తన కుడి కన్ను పూర్తిగా కనబడకుండా పోయిందని తెలిపారు. జిమ్ చేస్తున్న సమయంలో.. రాడ్ స్ప్రింగ్ గట్టిగా తగలడంతో తాను చూపు కోల్పోయినట్టు చెప్పుకొచ్చాడు. ఇక అప్పటి నుంచి కళ్ళజోడు వాడుతున్నానని, ఇప్పటికీ ఆ ఇబ్బంది నాకు ఉందని చెప్పాడు. ప్రస్తుతం హీరోగా ఛాన్సులు కూడా ఎవరు ఇవ్వడం లేదని వాపోయాడు.