మోహన్ బాబు వద్దన్న సినిమాని.. చిరంజీవి తీసి సూపర్ హిట్ కొట్టాడా…? ఆ సినిమా ఏదంటే..?

తెలుగు చిత్ర పరిశ్రమంలో ఎన్నో సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలలో మొదట అనుకున్న హీరో ఒకరు.. సినిమాలో నటించిన హీరో ఒకరు. అలా నటించిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వగా మరి కొన్ని సినిమాలు ప్లాప్ సినిమాలుగా మిగిలిపోయాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఓ సినిమాకి జరిగింది. చిరంజీవి తనకు కెరియ‌ర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాలలో మొదట అనుకున్న హీరో ఒకరు ..ఆ హీరో కాదన్నడంతో తర్వాత సినిమాలు చిరంజీవి దగ్గరికి వచ్చాయి.

Chiranjeevi, Mohan Babu on the same stage .. Exciting meeting | Chiranjeevi, Mohan babu attend 24crafts meeting at Film nagar Hyderabad - filmyzoo - Hindisip

ఈ క్రమంలోనే చిరంజీవి అలా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. నిజానికి చిరంజీవి హీరోగా నటించిన హిట్లర్ సినిమాకు మొదట చిరంజీవి ని హీరోగా అనుకోలేదట. ముందుగా ఇందులో మోహన్ బాబుని హీరోగా నిర్మాతలు అనుకున్నారట. మలయాళం లో మమ్ముట్టి హీరోగా సిద్ధిక్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చి అక్కడ ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమా రీమేక్ హక్కులను గాడ్ ఫాదర్ సినిమా తెర్కెక్కించిన మోహన్ రాజా తండ్రి ఎడిటర్ మోహన్ సొంతం చేసుకున్నాడు.

21 Years For Chiranjeevi's Comeback Movie

ఈ సినిమాలో ముందుగా మోహన్ బాబును హీరోగా అనుకున్నారు. ఆయనకు కథ కూడా చెప్పారు. ఆయనకు కథ నచ్చకపోవటంతో ఆయన రిజెక్ట్ చేశారు. తర్వాత ఈ సినిమానే ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహిస్తున్నాడని ఎడిటర్ మోహన్.. మోహన్ బాబుకు చెప్పగా ఆయన ఒప్పుకున్నాడు.. కొన్ని అనుకోని కారణాలవల్ల ఇవివి. సత్యనారాయణ ఈ సినిమాకు డైరెక్టర్గా తప్పుకున్నాడు. దీంతో మోహన్ బాబు కూడా ఈ సినిమాను పక్కన పెట్టేసాడు.

Hitler Movie : చిరంజీవి హిట్లర్ మోహ‌న్ బాబు చేయాల్సిందా.. ఎందుకు మిస్ అయింది? | The Telugu News

తర్వాత ఈ స్టోరీని చిరంజీవికి చెప్పగా ఓకే చెప్పాడు. ఈ సినిమాకు తెలుగులో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి హీరోగా హిట్లర్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకి ముందు చిరంజీవికి వరుసగా మూడు డిజాస్టర్లు వచ్చాయి. ఆశలన్నీ హిట్లర్ సినిమా మీదే పెట్టుకోనాడుడు చిరంజీవి. ఈ సినిమా విడుదలై చిరంజీవికి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ తీసుకువచ్చింది. ఇలా మోహన్ బాబు చేయాల్సిన సినిమా చిరంజీవి తీసి తన కెరియర్ లోనే మరో బ్లాక్ బస్టర్ హిట్‌ వేసుకున్నాడు.