ప్రజారాజ్యం పార్టీ పెట్టి అన్ని కోట్లు నష్టపోయిన చిరంజీవి..!!

తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక భారీ వసూళ్ల తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో గ్రాండ్గా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు చిత్ర బృందం కూడా హాజరైంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ NV ప్రసాద్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు .. ఇక నిర్మాత ఎన్ వి ప్రసాద్ మాట్లాడుతూ .. ఇక ఈరోజు ప్రపంచం మొత్తం రాముడు అంటే చరణ్ బాబు.. మేము చిరంజీవి తర్వాత రామ్ చరణ్ ను ఫాలో అవుతున్నాము.. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు తిరుపతిలో పోటీ చేశారు ఇక అప్పుడు ఎన్నికలు మొత్తం మేమే చూసుకున్నాము. లోకల్ లీడర్స్ తో మాట్లాడి అందరిని సమన్వయం చేశాము.

Producer N V Prasad About Chiranjeevi
ఎంతోమందికి తెలియని ఒక విషయం కూడా ఉంది. ప్రజారాజ్యం పార్టీతో చిరంజీవి గారు ఎంత ఇబ్బంది పడ్డారో మాకు తెలుసు. ఇక మీకు ఎవ్వరికీ తెలియని నగ్నసత్యం సార్ కి చెప్పకుండా మీకు చెబుతున్నాను.. ఇక ఆయన గురించి చాలామంది అమ్ముడుపోయారని అంటున్నారు. మీకు ఎవరికీ తెలియని అసలు విషయం ఏమిటంటే.. మద్రాసు ల్యాబ్ పక్కన ఉండే కృష్ణ గార్డెన్ ప్రాపర్టీని అమ్మి ప్రజారాజ్యం పార్టీ క్లోజ్ చేసే రోజు అప్పులు తీర్చారు.

Praja Rajyam : అసలు ప్రజా రాజ్యం పార్టీ ఎలా కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది.?  | The News Qube కొన్ని కోట్ల విలువ చేసే అంత ప్రాపర్టీ అమ్మిన వ్యక్తి ఆయన.. ఈ విషయం ప్రపంచానికి తెలియదు.. ఆయన కష్టంలో ఫ్యామిలీ మొత్తం .. ఇండస్ట్రీ మొత్తం ఉంది.. ఇక ఈరోజుకి కూడా ఉదయం 5 గంటలకు నిద్ర లేచి పనిచేసే వ్యక్తి గురించి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు.. ఏది పడితే అది రాస్తూనే ఉన్నారు. ధైర్యం ఉంటే నా గురించి రాయమని చెప్పండి.. చిరంజీవి స్పెషల్ పర్సన్ కాబట్టి అందరి దృష్టిలో ఆయనే ఏం చేసిన ఆయననే నిందిస్తున్నారు అంటూ అసలు విషయం బయట పెట్టాడు ఎన్ వి ప్రసాద్.