ఆ స్టార్ డైరెక్ట‌ర్‌ను కౌంట‌ర్ చేసిన మోహ‌న్‌రాజా… ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం…!

చిరంజీవి ఆచార్య వంటి భారీ డిజాస్టర్ సినిమా తర్వాత.. తాజాగా “గాడ్ ఫాదర్” సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. చిరంజీవి ఆచార్య ఇచ్చిన డిజాస్టర్ నుంచి “గాడ్ ఫాదర్” సినిమాతో బయటపడ్డాడు. ఈ సినిమా ప్రస్తుతం మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించరు. ఈ సినిమాని మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ కు రీమేక్ గా తీశారు.

తెలుగులో ఈ సినిమాని తమిళ్ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించారు. అయితె డైరెక్టర్ మోహన్ రాజా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశాడు. చిరంజీవి సినిమా షూటింగ్ టైంలో ద‌ర్శ‌కుల బాధ్య‌త‌ల్లో కలగ చేసుకోరంటూ… అలా అంటే ఎవరినైనా నేను కొడతానని.. ఆయన 40 సంవత్సరాల అనుభవాన్ని మనం ఉపయోగించుకోకపోతే మనమే ఇబ్బందికి గురవుతామ‌ని రాజా తెలిపారు.

Anyone come..I'm not afraid..Mohan Raja's shocking challenge ..!? »  Jstimesnow

ప్రతి పనిలోనూ ఆయన సూచనలు తీసుకోవడం వల్లే “గాడ్ ఫాదర్” ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మోహన్ రాజా అన్నాడు’. ఇప్పుడు ఈ కామెంట్లు టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్ ని టార్గెట్ చేసి మోహన్ రాజు అన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఆ స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివే అని కొంద‌రు అంటున్నారు. మ‌రి ఇందులో నిజానిజాలు ఏంటో…!