మెగాస్టార్ అంటే అంతేమరి… 6 వేల మంది విద్యార్థుల అభిమానానికి ఫిదా అయిన గాడ్ ఫాదర్!

మెగాస్టార్ చిరంజీవి… పరిచయం అక్కర్లేని ఓ ప్రభంజనం. గత మూడు దశాబ్దాలుగా అలుపెరుగని కష్టంతో తన నటనతోని యావత్ తెలుగునాట రికార్డులు సృష్టిస్తున్న ఓ సినిమా సునామి. తెలుగు చిత్ర పరిశ్రమలో వున్న ప్రస్తుత అగ్రస్థాయి నటులలో నెంబర్ 1 పొజిషన్లో వున్న మాస్ ఇమేజ్ వున్న నటుడు. వందలాది చిత్రాల్లో నటించి, టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అనేక సేవా కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొంటారు. అలాగే సమయం దొరికినప్పుడల్లా ఆయా ఈవెంట్లు, ప్రొగ్రామ్స్ కు అంటెండ్ అవుతూ అందరిలో జోష్ నింపుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్థాపించిన ‘మల్లారెడ్డి’ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ‘క్యానర్స్ అవేర్ నెస్’ ప్రోగ్రామ్ జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా కాలేజీలోని 6 వేల మంది విద్యార్థులు చిరుపై ఉన్న అభిమానాన్ని తమదైన శైలిలో చాటుకున్నారు. అవును, దర్శకుడు బాబీ, చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలోని చిరు రూపాన్ని కాలేజీ గ్రౌండ్ లో ప్రదర్శించగా, ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇకపోతే, ఈ నేపథ్యంలో టాప్ వ్యూ ద్వారా ఆ దృశ్యకావ్యాన్ని వీడియో రూపంలో వీక్షించిన చిరంజీవి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా తాజాగా దీనిపై దర్శకుడు బాబీ కూడా ట్వీటర్ ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా మేడే ఉత్సవాల్లో మల్లారెడ్డి చిరుపై చూపిన ప్రేమను మరోసారి గుర్తు చేసుకున్నారు. యేటా దేశంలో 8 లక్షల మంది క్యాన్సర్ తో మరణిస్తున్నారని చిరు తెలిపారు. అందరం కలిసి పోరాడితే ఆ మహామ్మారిని నిర్మూలించ్చవచ్చని, ఇందుకు యువత ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చెడు వ్యవసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.